
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. శనివారం ( ఆగస్టు 12) ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఏకపక్షంగా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. విండీస్ విధించిన 179 పరుగు లక్ష్యాన్ని 17 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. ఓపెనర్లు శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్‌లు అద్భుతంగా ఆడి మొదటి వికెట్‌కు ఏకంగా 165 పరుగుల భాగస్వామ్యం అందించారు. యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 84 నాటౌట్, 11 ఫోర్లు 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. రెండో టీ20 మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ చేశాడు. ఇక మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (47 బంతుల్లో 77, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. తిలక్ వర్మ (5 బంతుల్లో 7 నాటౌట్) నిలిచాడు. ఫ్లోరిడాలో భారత్‌కు ఇది వరుసగా ఐదో విజయం. ఇక ఆదివారం (ఆగస్టు 13) కీలకమైన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. సునామీ ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభంలో 0-2తో వెనుకబడిన టీమ్ ఇండియా..అద్భుతంగా పునరాగమనం చేసింది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి 2-2 తో సిరీస్‌ను సమం చేసింది. కాగా లాడర్‌హిల్‌లోని ఫ్లాట్ పిచ్‌పై వెస్టిండీస్‌ను భారీ స్కోరు చేయకుండా బౌలర్లు అడ్డుకున్నారు. దీనికి తోడు భారత జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ఫీల్డింగ్‌తో మంచి క్యాచ్‌లు పట్టారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను అర్ష్‌దీప్ సింగ్ మొదటి దెబ్బ కొట్టాడు. రెండవ ఓవర్‌లోనే కైల్ మేయర్స్ వికెట్ పడగొట్టడం ద్వారా మంచి ఆరంభాన్ని అందించాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన వన్డే కెప్టెన్ షాయ్ హోప్ ధాటిగా ఆడి జట్టు స్కోరును 50 పరుగులు దాటించాడు. ఇక్కడే భారత్‌కు వరుసగా 3 వికెట్లు దక్కాయి. అర్ష్‌దీప్ ఆరో ఓవర్‌లో బ్రాండన్ కింగ్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఏడో ఓవర్లో నికోలస్ పూరన్, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ వికెట్లను కూల్చి విండీస్ బ్యాటింగ్‌ను కుల్దీప్ ధ్వంసం చేశాడు. 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి విండీస్ ఇన్నింగ్స్ కష్టాల్లో కూరుకుపోయినట్లు కనిపించినా షాయ్ హోప్‌కు షిమ్రాన్ హెట్మెయర్ రూపంలో మంచి భాగస్వామి లభించింది. వన్డే సిరీస్, చివరి మూడు టీ20ల్లో విఫలమైన హెట్మెయర్ బ్యాట్ ఎట్టకేలకు మళ్లీ తన దూకుడు చూపించాడు. వీరిద్దరూ కలిసి 36 బంతుల్లో 49 పరుగులు జోడించి జట్టును 100 పరుగులు దాటించారు. యుజ్వేంద్ర చాహల్ హోప్‌ని ఔట్ చేసినా హెట్మెయర్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో విండీస్ జట్టు 178 పరుగుల భారీ స్కోరు చేసింది.
India make it 2-2, courtesy Gill and Yashasvi’s brilliance 💪
Decider tomorrow 🤞
..#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/FRFjzcThFM
— FanCode (@FanCode) August 12, 2023
“ʙᴀᴛᴛɪɴɢ, ᴛᴜ ʙᴀʜᴏᴛ ᴄʜᴀɴɢᴇ ʜᴏɢᴀʏɪ ʜᴀɪ.”#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/FWm8rjacYN
— FanCode (@FanCode) August 12, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..