IND Vs WI: గౌహతి వేదికగా మరో క్రికెటర్ ఆరంగేట్రం.. రెండో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు

IND Vs WI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే గౌహతిలో జరగనుంది. తొలి మ్యాచ్‌లో కోహ్లీ, గిల్ సెంచరీలతో అదరగొట్టగా, బౌలింగ్ విభాగంపై టీమిండియా ఆందోళనలో ఉంది. బుమ్రా, హార్దిక్ అందుబాటులో లేకపోవడంతో సిరాజ్ రీఎంట్రీ లేదా ఆకిబ్ నబీ అరంగేట్రంపై ఉత్కంఠ నెలకొంది. రెండో వన్డేలో తుది జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

IND Vs WI: గౌహతి వేదికగా మరో క్రికెటర్ ఆరంగేట్రం.. రెండో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు
Ind Vs Wi (1)

Updated on: Sep 29, 2026 | 2:56 PM

IND Vs WI: భారత్ అలాగే వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ మరోసారి తన జోరు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బ్యాటింగ్ లైనప్ ఒకవైపు సంతోషాన్ని ఇస్తుంటే, గౌహతి మ్యాచ్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఫాస్ట్ బౌలింగ్ కాంబినేషన్ కలవరపెడుతోంది. రాబోయే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు జట్టులోని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు.

మొదటి వన్డే మ్యాచ్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ అలాగే విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీలతో చెలరేగడంతో భారత్ 296 పరుగుల లక్ష్యాన్ని 42 ఓవర్లలోనే సులభంగా ఛేదించింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించినప్పటికీ, జస్ప్రీత్ బుమ్రా‎ అలాగే హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం వల్ల పేస్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపించింది. ఆసియా క్రీడల నిమిత్తం బుమ్రా జపాన్‌లో ఉండగా, హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆల్ రౌండర్ నితీశ్‎ కుమార్ రెడ్డికి కొత్త బంతిని అందించే బాధ్యతను అప్పగించారు.

ఇది కూడా చదవండి: Virat Kohli: సచిన్, ధోనీ కాదు.. కింగ్ కోహ్లీ దృష్టిలో బెస్ట్ వన్డే బ్యాటర్ ఎవరంటే?

గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన నితీశ్‎ కుమార్ రెడ్డి తొలి వన్డేలో తన ఫామ్‎ను కనుగొనడానికి తీవ్రంగా కష్టపడ్డాడు. బౌలింగ్‌లో తడబడిన అతను ఒకే ఓవర్లో ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పూర్తి సపోర్టు ఇస్తున్నప్పటికీ, ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా బరిలోకి దిగిన నితీశ్‎ నిరాశపరచడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో మళ్లీ నితీశ్‎కే అవకాశం ఇస్తారా లేక సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకువస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన జమ్ము కశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీ ఇప్పటివరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. జట్టులో ఆల్ రౌండర్ల కొరతను తీర్చడానికి తొలి మ్యాచ్‌లో నమన్ ధీర్‌కు అవకాశం ఇచ్చారు. అయితే సిరాజ్ గనుక తుది జట్టులోకి తిరిగి వస్తే, ఆల్ రౌండర్లలో ఎవరో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి వస్తుంది. ఒకవేళ ఆకిబ్ నబీకి అరంగేట్రం చేసే అవకాశం లభిస్తే, బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి:Virat Kohli: వెస్టిండీస్‌పై సిక్సర్ల వర్షం.. తన రికార్డును తానే బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

మొదటి వన్డేలో కేవలం 74 బంతుల్లోనే సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో 15,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. జనవరి 2023లో శ్రీలంకపై ఇదే బర్సపరా స్టేడియంలో తన 45వ వన్డే సెంచరీ సాధించిన కోహ్లీ, ఇప్పుడు మళ్ళీ అదే మైదానంలో బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. కోహ్లీ అద్భుతమైన ఫామ్ జట్టుకు అతిపెద్ద బలమని చెప్పవచ్చు.

తొలి వన్డేలో ఫీల్డింగ్‌లో విఫలమై మ్యాచ్‌ను కోల్పోయిన వెస్టిండీస్ జట్టు, ఈ రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలని చూస్తోంది. కెప్టెన్ షాయ్ హోప్ నేతృత్వంలోని కరేబియన్ జట్టు భారత్‌ను గట్టిగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. కోచ్ డారెన్ సమ్మీ తన ఆటగాళ్లతో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయించారు. 2002 తర్వాత భారత్‌లో వన్డే సిరీస్ గెలవని వెస్టిండీస్, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us