IND vs WI: రోహిత్, కోహ్లీ ఔట్.. కెప్టెన్‌గా హార్దిక్.. తుదిజట్టులో అన్‌లక్కీ ప్లేయర్‌కు చాన్స్..

|

Jul 29, 2023 | 7:44 PM

IND vs WI 2nd ODI: ఇప్పటికే తొలి వన్డే గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ముందుగానే సిరీస్‌ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అలాగే భారత్ వేదికగా జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు సన్నాహకంగా వెస్టిండీస్‌తో ఈ సిరీస్ ఆడుతోంది టీమిండియా. ఈ కారణంగానే సీనియర్ ప్లేయర్లు లేకుండా యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి, వారి ఆటతీరును అంతర్జాతీయ స్థాయిలో పరీక్షస్తోంది. ఇందులో భాగంగా

IND vs WI: రోహిత్, కోహ్లీ ఔట్.. కెప్టెన్‌గా హార్దిక్.. తుదిజట్టులో అన్‌లక్కీ ప్లేయర్‌కు చాన్స్..
IND vs WI 2nd ODI
Follow us on

IND vs WI 2nd ODI: వెస్టిండీస్‌పై తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ శనివారం అనూహ్య మార్పులతో రెండో మ్యాచ్‌ కోసం మైదానంలోకి దిగింది. బర్బడోస్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో సీనియర్ ప్లేయర్లు లేకుండానే యువ ఆటగాళ్లతో కరేబియన్లతో తలపడుతోంది. ఈ మేరకు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో.. కొంతకాలం నుంచి అన్‌లక్కీ ప్లేయర్‌గా మారిన సంజూ శామ్సన్, ఆల్‌రౌండర్ అక్సర్ పటేల్ జట్టులోకి వచ్చారు. రోహిత్ లేకపోవడంతో హార్ధిక్ పాండ్యా నాయకత్వ పగ్గాలు అందుకున్నాడు. ఇక మ్యాచ్‌కి ముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు తరఫున ఇషాన్ కిషన్, శుభమాన్ గిల్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

అయితే ఇప్పటికే తొలి వన్డే గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి ముందుగానే సిరీస్‌ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అలాగే భారత్ వేదికగా జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు సన్నాహకంగా వెస్టిండీస్‌తో ఈ సిరీస్ ఆడుతోంది టీమిండియా. ఈ కారణంగానే సీనియర్ ప్లేయర్లు లేకుండా యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి, వారి ఆటతీరును అంతర్జాతీయ స్థాయిలో పరీక్షస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 9 నెలల తర్వాత జట్టులోకి సంజూ శామ్సన్‌ని తీసుకుంది.

కాగా, తొలి వన్డేలో కూడా టీమిండియా ప్రయోగాత్మకంగానే ఆడింది. ఓపెనర్‌గా రావాల్సిన రోహిత్ ఏడో స్థానంలో.. విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ అవకాశం ఇవ్వకుండా వరుసగా యువ ఆటగాళ్లను క్రీజులోకి పంపింది. ఇక ఆ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయిన తర్వాత రోహిత్ రంగంలోకి దిగి జట్టు విజయంలో భాగమయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్ల వివరాలు

భారత జట్టు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), శుభమాన్ గిల్‌, సంజూ శామ్స‌న్, సూర్య కుమార్ యాద‌వ్, ఇషాన్ కిషన్‌, ర‌వీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్‌ కుమార్‌, అక్ష‌ర్ ప‌టేల్.

వెస్టిండీస్‌: షై హోప్‌(కెప్టెన్‌), బ్రాడ్నన్ కింగ్, కెయల్ మేయర్స్, అలిక్ అథనాజే, షిమ్రాన్ హెట్మేయర్, కీసి కార్టి, రొమారియా షెఫర్డ్, యన్నిక్ కారియా, అల్జారీ జోసెఫ్, గూడకేష్ మోటీ, జేడెన్ సీల్స్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..