IND vs WI: నాడు తండ్రితో.. నేడు కొడుకుతో తలపడేందుకు సిద్ధమైన విరాట్.. అరుదైన లిస్టులో ఎవరున్నారో తెలుసా?

|

Jul 12, 2023 | 3:11 PM

Virat Kohli: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో టెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన సందర్భంలో అతను వెటరన్ విండీస్ ఆటగాడు శివనారాయణ్ చందర్‌పాల్‌తో ఆడాడు.

IND vs WI: నాడు తండ్రితో.. నేడు కొడుకుతో తలపడేందుకు సిద్ధమైన విరాట్.. అరుదైన లిస్టులో ఎవరున్నారో తెలుసా?
Virat Kohli
Follow us on

India vs West Indies Test Series: వెస్టిండీస్‌తో భారత జట్టు మొదటి టెస్ట్ రేపటి నుంచి ఆడనున్న సంగతి తెలిసిందే. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌తో పాటు ప్రత్యేక జాబితాలో చేరనున్నాడు. జులై 12 నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. విండీస్ టెస్టు జట్టులో వెటరన్ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ కూడా ఉన్నాడు.

విరాట్ కోహ్లీ 12 ఏళ్ల క్రితం వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేసినప్పుడు, ఆ సమయంలో శివనారాయణ్ చంద్రపాల్‌తో ఆడాడు. ఈ ఫార్మాట్‌లో టీమిండియాపై ఆయన రికార్డు ఎప్పుడూ చాలా అద్భుతంగానే ఉంటుంది. ఇప్పుడు కోహ్లీ మళ్లీ వెస్టిండీస్‌తో ఆడేందుకు మైదానంలోకి దిగనున్నాడు. శివనారాయణ కుమారుడు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ కూడా బరిలోకి దిగనున్నాడు.

తండ్రి తర్వాత, కొడుకుపై కూడా ఆడిన విరాట్ కోహ్లీ ఓ ప్రత్యేక క్లబ్‌లో చేరనున్నాడు. ఇందులో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నారు. సచిన్ తన కెరీర్‌లో తండ్రీ కొడుకులను ఎదుర్కొన్నాడు. 1992లో ఆస్ట్రేలియా ఆటగాడు జియోఫ్ మార్ష్‌తో సచిన్ ఆడాడు. ఆ తర్వాత, 2011-12 సంవత్సరంలో ఆస్ట్రేలియా పర్యటనలో, సచిన్, జియోఫ్ మార్ష్ కుమారుడు షాన్ మార్ష్‌తో తలపడ్డాడు.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు టెస్టు ఫార్మాట్‌లో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ గణాంకాలు..

వెస్టిండీస్ జట్టులో ఇప్పటివరకు యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ ప్రదర్శన గురించి మాట్లాడితే.. 6 మ్యాచ్‌లు ఆడి 11 ఇన్నింగ్స్‌ల్లో 45.30 సగటుతో మొత్తం 453 పరుగులు చేశాడు. ఈ సమయంలో 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. 27 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 207 పరుగులు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..