IND vs WI 1st ODI: నేటి నుంచే భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభం.. షెడ్యూల్, రికార్డ్స్ వివరాలివే..

India vs West Indies 1st ODI: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా నేటి నుంచి ఆతిథ్య జట్టులో వన్డే సిరీస్‌లో తలపడనుంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల కోసం కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత్ టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న..

IND vs WI 1st ODI: నేటి నుంచే భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభం.. షెడ్యూల్, రికార్డ్స్ వివరాలివే..
IND vs WI 1st ODI

Updated on: Jul 27, 2023 | 8:45 AM

India vs West Indies 1st ODI: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా నేటి నుంచి ఆతిథ్య జట్టులో వన్డే సిరీస్‌లో తలపడనుంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల కోసం కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత్ టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు వన్డే ప్రపంచకప్ టోర్నీకి క్వాలిఫై కాలేకపోయిన కరేబియన్లు ఈ వన్డేలో భారత్‌పై విజయం సాధించి తామేంటో మళ్లీ క్రికెట్ ప్రపంచానికి తెలియజేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే తొలి వన్డే బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగుతుంది.

అయితే గత 17 ఏళ్లలో భారత్‌తో జరిగిన వన్డే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వెస్టిండీస్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 1983 మార్చి 9న జరిగిన తొలి భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ నుంచి ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య మొత్తం 23 సిరీస్‌లు జరిగాయి. 1983 నుంచి 1989 వరకు కరేబియన్ టీమ్ మాత్రమే వరుసగా 5 వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. ఆ తర్వాత తొలిసారిగా 1994లో భారత్.. వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత గెలుపోటముల పరంపర సాగిన క్రమంలో భారత్‌ను వెస్టిండీస్ చివరిసారిగా 2006లో ఓడించింది. అదే సంవత్సరం చివర్లో విండీస్‌తో మళ్లీ జరిగిన వన్డే సిరీస్ మొదలు ఇప్పటి వరకు మొత్తం 12 సిరీస్‌ల్లో భారత జట్టు వరుసగా గెలిచింది. ఇది వన్డే క్రికెట్‌లో ఓ ప్రపంచ రికార్డ్ కావడం కూడా విశేషం. అలాగే ఇరు జట్ల మధ్య మొత్తం 139 వన్డేలు జరగ్గా.. అందులో భారత్ 70, విండీస్ 63 గెలిచాయి. మరో 2 డ్రా కాగా మరో 4 మ్యాచ్‌లు ఫలితం లేకుండానే ముగిశాయి.

ఇవి కూడా చదవండి

భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ 2023 షెడ్యూల్

  • 1వ వన్డే: జూలై 27, బార్బడోస్ – రాత్రి 7 గంటలు
  • 2వ వన్డే: జూలై 29, బార్బడోస్ – రాత్రి 7 గంటలు
  • 3వ ODI: ఆగస్టు 1, ట్రినిడాడ్ – రాత్రి 7 గంటలు

వన్డే సిరీస్ కోసం ఇరు జట్లు..

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్ టీమ్: షై హోప్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్(వైస్ కెప్టెన్), అలిక్ అథనాజే, యానిక్ కరియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోషన్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, ఒషానే థామస్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..