IND vs SL: దిగ్గజాలు విఫలమైన చోట.. పరుగుల వర్షం కురిపించిన యంగ్ ప్లేయర్..!

|

Mar 12, 2022 | 9:17 PM

బెంగళూరులో భారత్ వర్సె్స్ శ్రీలంక మధ్య డే-నైట్ టెస్ట్ ఈ రోజు(మార్చి 12) అంటే శనివారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజున భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

IND vs SL: దిగ్గజాలు విఫలమైన చోట.. పరుగుల వర్షం కురిపించిన యంగ్ ప్లేయర్..!
India Vs Sri Lanka
Follow us on

బెంగళూరులో భారత్ వర్సె్స్ శ్రీలంక(Ind vs Sl) మధ్య డే-నైట్ టెస్ట్ ఈ రోజు(మార్చి 12) అంటే శనివారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజున భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఎం. చిన్నస్వామిలాంటి అసమాన బౌన్సీ పిచ్‌పై శ్రీలంక(Sri Lanka) స్పిన్నర్లు గులాబీ బంతితో విధ్వంసం సృష్టించారు. భారత్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) తుఫాను ఇన్నింగ్స్ ఆడకుంటే టీమ్ ఇండియా అత్యల్ప స్కోర్‌కే ఔటయ్యేది. అయ్యర్ తన సెంచరీని కోల్పోయాడు. కానీ, బలమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను కాపాడాడు.

శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చిన తొలి సెషన్‌లో టీమిండియా కేవలం 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కూడా పెవిలియన్ బాట పట్టారు. 148 పరుగుల వద్ద 6 వికెట్లు పతనమైన తర్వాత, శ్రేయాస్ పరుగుల వర్షం కురిపించాడు. భారత ఇతర బ్యాట్స్‌మెన్‌లకు విపత్తుగా మారిన శ్రీలంక స్పిన్నర్లకు శ్రేయాస్ గుణపాఠం చెప్పాడు.

ఈ సమయంలో ధనంజయ డి సిల్వా వేసిన ఒకే ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టడం ద్వారా శ్రేయస్ కేవలం 54 బంతుల్లో తన రెండవ టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. ఒకవైపు నుంచి వికెట్లు పడుతుండగా మరోవైపు శ్రేయాస్ బ్యాట్ నుంచి పరుగులు వస్తున్నాయి. టెస్ట్ మ్యాచ్‌లో ODI శైలిలో బ్యాటింగ్ చేస్తూ, శ్రేయాస్ తన రెండవ సెంచరీకి చేరువయ్యాడు. అయితే ప్రవీణ్ జయవిక్రమ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో స్టంపౌట్ అయ్యాడు. భారత ఇన్నింగ్స్ ముగిసింది. శ్రేయాస్ అయ్యర్ తన ఇన్నింగ్స్‌లో కేవలం 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు.

శ్రేయాస్ కంటే ముందు ఈ పిచ్‌పై, శ్రీలంక స్పిన్నర్లు టర్న్, బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుని భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను సులభంగా ఎరగా మార్చారు. రోహిత్ శర్మ (15) స్లిప్ వద్ద లసిత్ అంబుల్దేనియా చేతికి చిక్కగా, విరాట్ కోహ్లీ (23) లో బాల్‌కు డిసిల్వా ఎల్‌బిడబ్ల్యూగా ఔటయ్యాడు. రిషబ్ పంత్ (39) కూడా అంబుల్దేనియా బౌలింగ్‌లో వెనుదిరగగా, హనుమ విహారి (31) ప్రవీణ్ జయవిక్రమకు బలయ్యాడు.

Also Read: IPL 2022: ఐపీఎల్ 2022లో సారథులుగా వీరే.. ఇద్దరు విదేశీయులకు దక్కిన ఛాన్స్.. 10 టీంల పూర్తి జాబితా ఇదే..

Watch Video: నో బాల్‌కు పెవిలియన్ చేరిన మయాంక్ అగర్వాల్.. రెండో ఓవర్లో హైడ్రామా.. అసలేం జరిగిందంటే?