Watch Video: టెస్టుల్లో విరాట్ కోహ్లీ స్పెషల్ ‘సెంచరీ’.. సన్మానించిన రాహుల్ ద్రవిడ్‌

|

Mar 04, 2022 | 10:13 AM

Virat Kohli 100th Test: విరాట్ కోహ్లీ 100వ టెస్టు ఆడుతోన్న సందర్భంగా బీసీసీఐ అతడిని సత్కరించింది. ఈ సన్మానానికి బోర్డు తరపున టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వం వహించారు.

Watch Video: టెస్టుల్లో విరాట్ కోహ్లీ స్పెషల్ సెంచరీ.. సన్మానించిన రాహుల్ ద్రవిడ్‌
Ind Vs Sl Team India Star Player Virat Kohli 100th Test
Follow us on

విరాట్ కోహ్లి(Virat Kohli)కి బ్యాట్‌తో సెంచరీ చేసే ముందు.. మొహాలీ మైదానంలోకి దిగిన వెంటనే టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సెంచరీ పరుగులతో మాత్రం కాదు. భారత్- శ్రీలంక(India vs Sri Lanka) మధ్య జరుగుతున్న మొహాలీ టెస్టు విరాట్ కోహ్లీకి 100వ టెస్టు(100th Test). టెస్టు క్రికెట్‌లో ఇన్ని మ్యాచ్‌లు ఆడిన 12వ ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచంలో 71వ ఆటగాడిగా మారాడు. అయితే అభిమానులు మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న 71వ అంతర్జాతీయ సెంచరీని కూడా ఈ స్పెషల్ మ్యాచులో పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.

విరాట్ కోహ్లీ 100వ టెస్టు సాధించినందుకు బీసీసీఐ అతడిని సత్కరించింది. ఈ సన్మానానికి బోర్డు తరపున టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వం వహించారు. కోహ్లి సాధించిన ఘనతపై ద్రవిడ రెండు మాటలు చెప్పి మెమెంటోతో సత్కరించాడు.

విరాట్ 100వ టెస్టుకు కుటుంబ సమేతంగా..
విరాట్ కోహ్లీ 100వ టెస్టును చూసేందుకు క్రికెట్ అభిమానులే కాదు.. అతని కుటుంబం మొత్తం మొహాలీ మైదానానికి చేరుకున్నారు. తన ప్రసంగంలో, విరాట్ తన కెరీర్‌లో సాటిలేని సహకారం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

Also Read: Women’s World Cup 2022: పాకిస్తాన్ మ్యాచ్‌లో ఝులన్ గోస్వామి ముందు భారీ రికార్డు.. వికెట్ల క్వీన్‌గా మారేందుకు రెడీ..

IND vs SL, 1st Test, Day 1 Live Score: టీమిండియా ఓపెనర్ల శుభారంభం.. స్కోరెంతంటే?

Watch Video: ఇది ఎంతో ప్రత్యేకమైన ఉదయం.. ప్లేయర్లకు ఇలాంటి అవకాశాలు చాలా అరుదు: 100వ టెస్టుకు ముందు కోహ్లీ