IND vs SL, 1st Test, Day 1 Highlights: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియా స్కోరు ఎంతంటే..

| Edited By: Basha Shek

Mar 04, 2022 | 5:16 PM

IND vs SL, 1st Test, Day 1Highli: భారత్-శ్రీలంక  జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆట పూర్తయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసే సమయానికి

IND vs SL, 1st Test, Day 1 Highlights: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియా స్కోరు ఎంతంటే..
Ind Vs Sl Virat Kohli

భారత్-శ్రీలంక  జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆట పూర్తయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసే సమయానికి  85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (96) త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (45), అశ్విన్ (11) క్రీజులో ఉన్నారు. ఇరు జట్ల దృష్ట్యా ఈ మ్యాచ్ చారిత్రాత్మకంగా నిలవనుంది. భారత్‌ దృష్టిలో విరాట్‌ కోహ్లికి 100వ టెస్టు కావడమే కాకుండా రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఆడుతున్న తొలి టెస్టు కూడా ఇదే.  మరోవైపు శ్రీలంక టీంకు ఇది 300వ టెస్ట్ మ్యాచ్‌ కానుంది.

ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్:

శ్రీలంక: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా (కీపర్), సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార

ఇండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

Key Events

మొహాలీలో భారత్‌ రికార్డు

భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. మొహాలీలో భారత్ ఇప్పటివరకు 13 టెస్టులు ఆడగా, 7 గెలిచి, 1 మ్యాచులో ఓడిపోయింది. 5 టెస్టులు డ్రా అయ్యాయి.

శ్రీలంకపై భారత్ టెస్టు రికార్డు

భారత్‌-శ్రీలంక మధ్య ఇప్పటి వరకు 44 టెస్టులు జరగ్గా, అందులో 20 భారత్‌ విజయం సాధించగా, 7 శ్రీలంక గెలిలిచింది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 04 Mar 2022 05:06 PM (IST)

    ముగిసిన తొలి రోజు ఆట… టీమిండియా స్కోరు ఎంతంటే..

    భారత్- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసింది.  ఆట ముగిసే సమయానికి  టీమిండియా 85 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (45), రవిచంద్రన్ అశ్విన్ (10) క్రీజులో ఉన్నారు. కాగా చివరి 10 ఓవర్లలో టీమిండియా 80 పరుగులు సాధించడం విశేషం.

  • 04 Mar 2022 05:01 PM (IST)

    జడేజా జోరు.. 350 పరుగులు దాటిన టీమిండియా స్కోరు..

    టీమిండియా స్కోరు 350 పరుగులు దాటింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (45) ధాటిగా బ్యాటింగ్ చేస్తూ అర్ధ సెంచరీ వైపు అడుగులేస్తున్నాడు. అతనికి అశ్విన్ (11) సహకారం అందిస్తున్నారు.


  • 04 Mar 2022 04:48 PM (IST)

    నెర్వస్ నైన్టీస్.. పంత్ నాలుగేళ్లలో ఐదోసారి..

    టెస్టుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు రిషభ్ పంత్. విదేశాల్లోనూ భారీగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే వేగంగా మూడంకెల  స్కోరు చేసే క్రమంలో 90ల్లో ఎక్కువగా ఔటవుతున్నాడు. అతను గత నాలుగేళ్లలో ఐదుసార్లు నైన్టీస్ లో పెవిలియన్ చేరాడు.

  • 04 Mar 2022 04:42 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా… సెంచరీకి సమీపంలో ఔటైన పంత్..

    టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది.  97 బంతుల్లో 96 పరుగులు చేసిన రిషభ్ పంత్ లక్మల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. మరోవైపు జడేజా (35) నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతనికి తోడుగా క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ (0) ఉన్నాడు.  కాగా టీమిండియా ప్రస్తుతం స్కోరు 81 ఓవర్లలో 331/5.

  • 04 Mar 2022 04:14 PM (IST)

    300 దాటిన టీమిండియా స్కోరు.. దూకుడుగా ఆడుతోన్న పంత్..

    శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా  స్కోరు 300 పరుగులకు చేరుకుంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (82 బంతుల్లో 76) దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనికి రవీంద్ర జడేజా (27) సహకారం అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం టీమిండియా స్కోరు 77 ఓవర్లలో 310/5.

  • 04 Mar 2022 03:36 PM (IST)

    250 పరుగులు దాటిన టీమిండియా స్కోరు.. అర్ధ సెంచరీకి చేరువవుతోన్న పంత్..

    మూడో టెస్టులో టీమిండియా స్కోరు 250 పరుగులు దాటింది. రిషభ్ పంత్ (42), రవీంద్ర జడేజా (11) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.  మరోవైపు శ్రీలంక బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేస్తుండడంతో టీమిండియా స్కోరు కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 69 ఓవర్లలో 254/5. ఇంకా నేటి ఆటలో 21 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

  • 04 Mar 2022 03:17 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. నిరాశపర్చిన శ్రేయస్ అయ్యర్..

    టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. లంకతో టీ20 సిరీస్ లో మూడు అర్ధ సెంచరీలు చేసి ఆశలు రేపిన శ్రేయస్ అయ్యర్ (27)  పెవిలియన్ కు చేరుకున్నాడు. క్రీజులో కుదురుకున్నట్లు అనిపించినా డిసిల్వా బౌలింగ్ లో వికెట్లముందు దొరికిపోయాడు. ప్రస్తుతం  రిషభ్ పంత్ (33), రవీంద్ర జడేజా( 1) క్రీజులో ఉన్నారు. ఇక 64 ఓవర్లలో టీమిండియా స్కోరు  235/5.

  • 04 Mar 2022 02:40 PM (IST)

    రెండు వందలు దాటిన టీమిండియా స్కోరు..

    మూడో సెషన్ లో టీమిండియా స్కోరు 200కు చేరుకుంది.  శ్రేయస్ అయ్యర్ (15), రిషభ్ పంత్ (16) నిలకడగా ఆడుతున్నారు. కాగా నేటి ఆటలో ఇంకా 34 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

  • 04 Mar 2022 01:32 PM (IST)

    విరాట్ కోహ్లీ ఔట్..

    తన 100వ టెస్టులో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి 5 పరుగులు దూరంలో పెవిలియన్ చేరాడు. 45 పరుగుల వద్ద ఎంబుల్దియాన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో తన 100వ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంలో విఫలమయ్యాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా అవకాశం దక్కేనో లేదో చూడాలి.

  • 04 Mar 2022 01:07 PM (IST)

    8000 పరుగుల మైలు రాయిని చేరిన విరాట్ కోహ్లీ..

    విరాట్ కోహ్లీ తన 100వ టెస్టులో మరో మైలు రాయిని చేరుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన వెంటనే 8000 పరుగులు పూర్తి చేశాడు. టీమిండియా నుంచి ఈ లిస్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్, గవాస్కర్, లక్ష్మణ్ ఉన్నారు.

    Inngs to 8000 Test runs for India

    154 S Tendulkar

    157 R Dravid

    160 V Sehwag

    166 S Gavaskar

    169 V KOHLI

    201 VVS Laxman

  • 04 Mar 2022 12:56 PM (IST)

    అర్థ సెంచరీ పూర్తి చేసిన హనుమ విహారి..

    శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో తెలుగబ్బాయి హనుమ విహారి అర్థసెంచరీతో దూసుకెళ్తున్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తూ తన హాఫ్ సెంచరీని నమోదు చేసాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు 100వ టెస్ట్ ఆడుతోన్న విరాట్(35) కూడా అదే ఊపులో హాఫ్ సెంచరీ వైపు పయనిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ 2 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

  • 04 Mar 2022 11:22 AM (IST)

    100 పరుగులు దాటిన భారత్..

    శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులకు చేరుకుంది. రోహిత్ 29, మయాంక్ 33 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం హనుమ విహారి 29, విరాట్ కోమ్లీ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 04 Mar 2022 11:14 AM (IST)

    రెండో వికెట్ డౌన్..

    మయాంక్ అగర్వాల్(33) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఎంబుల్దెనియా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 80 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.

  • 04 Mar 2022 10:35 AM (IST)

    రోహిత్ శర్మ ఔట్..

    10వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన రోహిత్ శర్మను కుమార పెవిలియన్ బాట పట్టించాడు. ఓవర్ ఐదో బంతికి లక్మల్ షాట్‌ను ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్.. ఫైన్ లెగ్ వద్ద లక్మల్ చేతికి చిక్కాడు.

  • 04 Mar 2022 09:25 AM (IST)

    ఇది ఎంతో ప్రత్యేకం: విరాట్ కోహ్లీ

    “ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. నా భార్య ఇక్కడ ఉంది. అలాగే నా సోదరుడు కూడా ఇక్కడే ఉన్నాడు. అందరూ చాలా గర్వంగా ఉన్నారు. BCCIకి కూడా ధన్యవాదాలు.” విరాట్ కోహ్లీ

  • 04 Mar 2022 09:16 AM (IST)

    శ్రీలంక ప్లేయింగ్ XI..

    శ్రీలంక (ప్లేయింగ్ XI): దిముత్ కరుణరత్నే (కెప్టెన్), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా (కీపర్), సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార

  • 04 Mar 2022 09:14 AM (IST)

    టీమిండియా ప్లేయింగ్ XI..

    మొహాలీ టెస్టులో భారత్ 5 మంది బౌలర్లు, 6 మంది బ్యాట్స్‌మెన్‌ల కలయికతో బరిలోకి దిగింది.

    ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

  • 04 Mar 2022 09:13 AM (IST)

    భారత్ మొదట బ్యాటింగ్

    మొహాలీ టెస్టులో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను భారత్ చేర్చుకుంది. భారత ముగ్గురు స్పిన్నర్లలో అశ్విన్, జడేజా, జయంత్ యాదవ్‌లకు చోటు దక్కింది.

  • 04 Mar 2022 09:07 AM (IST)

    మొహాలీలో భారత్‌ రికార్డు

    భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు మొహాలీ వేదికగా ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్టు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మొహాలీలో భారత్ టెస్టు రికార్డును తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొహాలీలో భారత్ ఇప్పటివరకు 13 టెస్టులు ఆడగా, అందులో 7 గెలిచి, 1 మ్యాచులో ఓడిపోయింది. 5 టెస్టులు డ్రా అయ్యాయి.

Follow us on