IND vs SL: టీమిండియా బౌలర్ల దూకుడు.. అయినా ‘ప్రేమదాస’లో జాగ్రత్తగా ఉండాల్సిందే.. గత రికార్డులు ఇవే

ప్రస్తుతం మ్యాచ్‌ భారత్‌ వైపే ఉన్నా.. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రత్యర్థి పుంజుకునే అవకాశం ఉంది. ప్రేమదాస మైదానం రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం146 మ్యాచ్‌లు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 80 సార్లు గెలవడం గమనార్హం. అలాగే రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన జట్టు 56 మ్యాచుల్లో నెగ్గింది.

IND vs SL: టీమిండియా బౌలర్ల దూకుడు.. అయినా ప్రేమదాసలో జాగ్రత్తగా ఉండాల్సిందే.. గత రికార్డులు ఇవే
IND vs SL, Asia Cup 2023 Final

Updated on: Sep 17, 2023 | 4:51 PM

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ తుది దశకు వచ్చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌ వర్సెస్‌ శ్రీలంక జట్ల మధ్య టైటిల్‌ పోరు జరుగుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతోంది. హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించాడు. కడపటి వార్తలందే సమయానికి లంకేయులు 9 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రస్తుతం మ్యాచ్‌ భారత్‌ వైపే ఉన్నా.. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రత్యర్థి పుంజుకునే అవకాశం ఉంది. ప్రేమదాస మైదానం రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం146 మ్యాచ్‌లు జరగ్గా… మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 80 సార్లు గెలవడం గమనార్హం. అలాగే రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన జట్టు 56 మ్యాచుల్లో నెగ్గింది. ఈ పిచ్ బ్యాటింగ్‌తో పాటు స్లో టర్నర్. కాస్త స్పిన్‌ను ఎదుర్కుని నిలబడితే భారీ స్కోరు చేసేందుకు మంచి అవకాశం ఉందంటున్నారు.

ఇక ప్రేమదా స్టేడియంలో భారత్ – శ్రీలంక జట్లు మొత్తం 37 సార్లు తలపడ్డాయి. ఇందులో 18 సార్లు భారత్ గెలవగా.. ఆతిథ్య జట్టు 16 మ్యాచుల్లో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేస్తూ భారత్ 11 వన్డేల్లో విజయదుందుభి మోగించింది. అదే సమయంలో సెకెండ్‌ బ్యాటింగ్‌ చేస్తూ ఏడుసార్లు గెల్చింది. ప్రేమదాస స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 230 గా ఉంది. అయితే ఈ మైదానంలో విరాట్ కోహ్లీకి అద్భుత రికార్డు ఉండడం విశేషం. గత ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు కోహ్లీ.

ఇవి కూడా చదవండి

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆరు వికెట్లతో సిరాజ్ సంచలనం..

లంకేయులపై సిరాజ్ పంజా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..