SL vs IND: బ్యాటింగ్‌లో తుస్సు.. బౌలింగ్‌లో హిట్.. సూపర్ ఓవర్లో సూర్యసేన థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20 సిరీస్ కైవసం

|

Jul 31, 2024 | 6:18 AM

Sri Lanka vs India 3rd T20I: భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్ పల్లెకెలెలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను 3-0తో ముగించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు భారత జట్టు శ్రీలంకకు 138 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ టై అయింది. మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు.

SL vs IND: బ్యాటింగ్‌లో తుస్సు.. బౌలింగ్‌లో హిట్.. సూపర్ ఓవర్లో సూర్యసేన థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20 సిరీస్ కైవసం
Sri Lanka Vs India 3rd T20i
Follow us on

Sri Lanka vs India 3rd T20I: భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్ పల్లెకెలెలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను 3-0తో ముగించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు భారత జట్టు శ్రీలంకకు 138 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ టై అయింది. మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సూపర్ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే చేసింది.

ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే ఫోర్ కొట్టి మ్యాచ్‌ని గెలిపించాడు. ఈ సిరీస్‌లో టీమిండియా 3-0తో శ్రీలంకను వైట్‌వాష్ చేసింది. దీంతో కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శకం ఘనంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ కూడా బౌలింగ్‌లో కనిపించారు. అంతేకాదు సూర్య ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టడం విశేషం.

ఇవి కూడా చదవండి

బ్యాటింగ్‌‌లో తుస్సుమన్న భారత బ్యాటర్లు..

మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది. భారత జట్టు టాప్ ఆర్డర్ ఫ్లాప్ అని తేలింది. సంజూ శాంసన్ పేలవ ప్రదర్శనతో జట్టును మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లోనూ ఇతర మ్యాచ్‌ల మాదిరిగానే సంజూ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయితే, ఆ తర్వాత రింకూ, బిష్ణోయ్, సుందర్, సూర్య తమ బౌలింగ్‌తో శ్రీలంకపై విజయాన్ని కైవసం చేసుకున్నారు. సూపర్ ఓవర్‌లో కూడా వాషింగ్టన్ సుందర్ 2 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.

మరోవైపు బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. మూడో మ్యాచ్‌లో భారత్ తరపున బ్యాటింగ్ చేసిన శుభ్‌మన్ గిల్ 39 పరుగులు చేశాడు. దీంతో పాటు రియాన్ పరాగ్ 26 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేశారు.

మూడో మ్యాచ్‌లో శ్రీలంక బౌలింగ్ అద్భుతం..

మూడో మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా సరైనదేనని తేలింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్స్‌ను భారీ స్కోర్లు చేయనివ్వలేదు. శ్రీలంక బౌలింగ్‌లో మహిష్ తిక్షణ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు వనిందు హసరంగ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..