IND vs SL Pink Ball Test: డే అండ్ నైట్ టెస్టుకు అంతా సిద్ధం.. పింక్ బాల్‌తో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?

|

Mar 11, 2022 | 7:58 PM

భారత్-శ్రీలంక మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండోది, చివరి మ్యాచ్ డే-నైట్‌గా జరగనుంది. పింక్ బాల్‌తో ఇరుజట్లు బరిలోకి దిగనున్నాయి.

IND vs SL Pink Ball Test: డే అండ్ నైట్ టెస్టుకు అంతా సిద్ధం.. పింక్ బాల్‌తో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?
Ind Vs Sl Pink Ball Test
Follow us on

భారత్-శ్రీలంక (IND vs SL 2nd Test) జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇది డే-నైట్ టెస్ట్. ఇందులో క్రికెట్ ఎరుపు రంగుకు బదులుగా పింక్ బాల్‌తో ఆడనున్నారు. ఇప్పటి వరకు ఈ పింక్ బాల్‌తో టీమిండియా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడింది. వీటిలో రెండు గెలిచి, ఒకటి ఓడిపోయింది. భారత జట్టు ఫిబ్రవరి 2021లో ఇంగ్లాండ్‌తో చివరి డే-నైట్ టెస్టు ఆడింది. పింక్ బాల్ టెస్ట్‌గా పిలిచే డే-నైట్ టెస్ట్, ఇతర టెస్టుల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. డే-నైట్ టెస్ట్‌(day night test)లో రెడ్ బాల్‌కు బదులుగా పింక్ బాల్ ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని పింక్ బాల్ టెస్ట్(Pink Ball Test) అంటారు. పింక్ బాల్ లైట్లలో ఎక్కువగా కనిపిస్తుందని, ఈ మేరకు బాల్‌ను ఐసీసీ మార్చింది.

మొదటి పింక్ బాల్ టెస్ట్..

టీం ఇండియా తన మొదటి పింక్ బాల్ టెస్ట్ నవంబర్ 2019లో ఆడింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు కేవలం 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం కెప్టెన్‌ కోహ్లి సెంచరీతో భారత్‌ 347 పరుగులకు ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా రాణించలేక 195 పరుగులకు ఆలౌట్ అయి ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో..

భారత్ తన రెండవ డే-నైట్ టెస్టును అడిలైడ్‌లో ఆడింది. డిసెంబర్ 2020లో జరిగిన ఈ టెస్ట్‌లో, భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 244 పరుగుల డీసెంట్ స్కోరు సాధించి ఆస్ట్రేలియా జట్టును 191 పరుగులకు కుదించి 53 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 36 పరుగులకే ఆలౌటైంది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విధంగా భారత్ తన రెండో పింక్ బాల్ టెస్టులోనే ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఇంగ్లండ్‌తో మూడో పింక్ బాల్ టెస్ట్..

ఇంగ్లడ్ టీంతో ఫిబ్రవరి 2021లో టీమిండియా తన మూడవ డై అండ్ నైట్ టెస్టు ఆడింది. ఈ టెస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టెస్టులో ఇంగ్లండ్ 112 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత ఇన్నింగ్స్ కూడా కేవలం 145 పరుగులకే కుప్పకూలింది. దీని తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కూడా 81 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక్కడ నుంచి పింక్ బాల్ టెస్టులో భారత్ వికెట్ నష్టపోకుండా 49 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 70 పరుగులిచ్చి 11 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.

Also Read: Watch Video: ఈ బుడ్డోడి బ్యాటింగ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. క్రికెట్ గాడ్ నుంచి లక్కీ ఆఫర్.. అదేంటో తెలుసా?

ఇటు సోషల్ మీడియా.. అటు క్రికెట్‌లోనూ తగ్గేదేలే అంటోన్న స్టార్ ప్లేయర్.. ఎవరో గుర్తుపడితే మీరు గ్రేటే..