IND vs SL 2nd T20: పూణేలో అరంగేట్రం చేయనున్న మరో భారత యంగ్ ప్లేయర్.. రికార్డులు చూస్తే పరేషానే..

|

Jan 05, 2023 | 2:54 PM

Rahul Tripathi IND vs SL: టీమిండియా బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా దూరమయ్యాడు. అందువల్ల అతని స్థానంలో రాహుల్ త్రిపాఠికి భారత జట్టు అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది.

IND vs SL 2nd T20: పూణేలో అరంగేట్రం చేయనున్న మరో భారత యంగ్ ప్లేయర్.. రికార్డులు చూస్తే పరేషానే..
Team India
Follow us on

భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా పూణె వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. అంతకుముందు ముంబైలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ చివరి ఓవర్లో ఉత్కంఠ విజయం సాధించింది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని జట్టు సిరీస్ ను చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో పూణెలో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లోని ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ మార్పులు చేయనుంది. రాహుల్ త్రిపాఠికి ప్లేయింగ్‌ 11లో అవకాశం అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. అతనికి అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం లభించవచ్చని అంటున్నారు.

రాహుల్ త్రిపాఠి ప్రతిభావంతుడైన ఆటగాడు. దేశవాళీ మ్యాచ్‌ల్లో అతనికి మంచి రికార్డు ఉంది. కానీ, అతడికి టీం ఇండియాకు ఆడే అవకాశం ఇప్పటివరకు రాలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో 76 మ్యాచ్‌లు ఆడిన త్రిపాఠి 1798 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 10 అర్ధ సెంచరీలు సాధించాడు.

రాహుల్ 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 2728 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను 7 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు సాధించాడు. త్రిపాఠి 53 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 1782 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను 4 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు సాధించాడు. లిస్ట్ Aలో అతని అత్యుత్తమ స్కోరు 156 నాటౌట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ముంబైలో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. దీంతో సంజుకు విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో జితేష్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. అయితే సంజూ స్థానంలో రాహుల్ త్రిపాఠిని భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చని తెలుస్తోంది. అనుభవం ఉన్న ఆటగాడే కాకుండా రాహుల్ ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. అందుకే త్రిపాఠికి ప్రాధాన్యత ఇవ్వవచ్చని తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..