IND vs SL: టీమిండియా కుర్రాళ్ల దెబ్బకు సోషల్ మీడియా షేక్.. మీమ్స్‌తో నెటిజన్ల ఫెస్ట్!

|

Jul 19, 2021 | 12:30 PM

ఆదివారం జరిగిన భారత్, శ్రీలంక తొలి వన్డేలో టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేయడంతో.. లంక వద్ద మాటల్లేవ్. లంక బౌలర్లతో పాటు శిఖర్ ధావన్ కూడా ఈ కుర్రాళ్ల దెబ్బకు సెంచరీ మిస్ చేసుకున్నాడు.

IND vs SL: టీమిండియా కుర్రాళ్ల దెబ్బకు సోషల్ మీడియా షేక్.. మీమ్స్‌తో నెటిజన్ల ఫెస్ట్!
Ind Vs Sl Memes Fest
Follow us on

IND vs SL: ఆదివారం జరిగిన భారత్, శ్రీలంక తొలి వన్డేలో టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేయడంతో.. లంక వద్ద మాటల్లేవ్. లంక బౌలర్లతో పాటు శిఖర్ ధావన్ కూడా ఈ కుర్రాళ్ల దెబ్బకు సెంచరీ మిస్ చేసుకున్నాడు. సెంచరీ చేద్దామనుకుంటే కుదరలేదని బాహాటంగానే చెప్పుకొచ్చాడు. టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా (43: 24 బంతుల్లో 9×4), ఇషాన్ కిషన్ (59: 42 బంతుల్లో 8×4, 2×6) దెబ్బకు 15 ఓవర్లలోనే టార్గెట్ పూర్తియిందని ధావన్ వెల్లడించాడు. దీంతో సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలయ్యాయి. టీమిండియా అభిమానులు మీమ్స్‌తో పండుగ చేసుకుంటున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ సేన కేవలం 36.4 ఓవర్లలోనే 263/3తో విజయం సాధించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం.. 50 ఓవర్లకు 263 పరుగులు చేసింది. కరుణరత్న (43; 35 బంతులు, ఫోర్, రెండు సిక్సులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చాదర్, చాహల్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ పృథ్వీ షా(43 పరుగులు; 24 బంతులు, 9 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌ (86 నాటౌట్‌; 95 బంతులు, 6ఫోర్లు, 1సిక్స్) ఓపెనింగ్‌గా బరిలోకి దిగారు. ఓపెనర్ పృథ్వీ తొలి ఓవర్‌ నుంచే లంక బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఓవర్‌కు రెండు ఫోర్ల చొప్పున కొడుతూ దూకుడు పెంచాడు. క్రీజులో కొద్దిసేపే ఉన్నా.. బౌలర్లను ఊచకోత కోశాడు. ఇషాన్‌ కిషన్‌ (53; 34 బంతుల్లో 8×4, 2×6) శిఖర్‌కు తోడవడంతో భారత్ విజయం నల్లేరుపై నడకలా మారింది. మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతంగా (31; 20 బంతుల్లో 5×4) ఆడాడు. ఈ మ్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ప్రస్తుతం టీమిండియా జట్టుని ద్వితీయ శ్రేణి జట్టుగా శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున్ రణతుంగ ఎద్దేవా చేశాడు. ఇలాంటి టీమ్‌తో ఆడటం శ్రీలంక జట్టుకి అవమానకరమంటూ మాటలు పేల్చాడు. దీనికి సెహ్వాగ్ కైంటర్ కూడా ఇచ్చాడు. అంచనాలకి మించి రాణించిన యువ బ్యాట్స్ మెన్స్.. ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా పరుగులు రాబట్టారు. ఇక శ్రీలంక టీంలో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకపోవడం విశేషం. కరుణరత్నె (43: 35 బంతుల్లో 1×4, 2×6) ఒక్కడే కాస్త రాణించాడు. కెప్టెన్ షనక (39), అసలంక (38), అవిష్కా ఫెర్నాండో (33) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, చాహల్, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు పడగొట్టి లంకను చావు దెబ్బ కొట్టారు. పాండ్యా సోదరులు చెరో వికెట్ తీశారు. కాగా, భువనేశ్వర్ కుమార్ 9 ఓవర్లు వేసినా.. ఒక వికెట్ కూడా తీయలేకపోవడం గమనార్హం. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే మంగళవారం కొలంబో వేదికగా జరగనుంది.

Also Read:

18 బంతుల్లో 88 పరుగులు.. ఫోర్లు, సిక్సర్ల తుఫాన్ సృష్టించిన ఆస్ట్రేలియా ఆటగాడు..!

ENG vs PAK: భారీ సిక్స్‌ చూశారా? ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచులో బాదేసిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్..!

IND vs SL: అరంగేట్ర మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు.. కృనాల్ పాండ్య తర్వాత..!