మహిళల ప్రపంచకప్(WWC 2022) 28వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్(IND vs SA)పై విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి సాధించింది. లారా వోల్వార్డ్ (80) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ కౌర్, రాజేశ్వరి గైక్వాడ్ చెరో 2 వికెట్లు తీశారు. దీంతో ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరాలన్న భారత్(Team India Womens) కల చెదిరిపోయింది. ఆఫ్రికా తరఫున లారా వోల్వార్డ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. 79 బంతుల్లో 80 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. అదే సమయంలో లారా గూడాల్ 49 పరుగుల వద్ద ఔటైంది. భారత మహిళల జట్టు తరపున షెఫాలీ వర్మ 46 బంతుల్లో 53 పరుగులు చేసింది. అదే సమయంలో, స్మృతి మంధాన బ్యాట్ కూడా ఆఫ్రికన్ బౌలర్లపై విరుచకపడింది. 71 పరుగులతో ఆకట్టుకుంది. కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఈరోజు అద్భుత ఫామ్‌లో కనిపించింది. ఆమె 84 బంతుల్లో 68 పరుగులు చేసింది. టీమిండియా వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 57 బంతుల్లో 48 పరుగులు చేసి ఔట్ అయింది. దక్షిణాఫ్రికా తరపున మసాబటా క్లాస్, ఇస్మాయిల్ రెండేసి వికెట్లు తీశారు.
భారత్ నిష్క్రమణతో సెమీఫైనల్ జట్లను ఖరారు చేశారు. వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. అదే సమయంలో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా పోరాడనుంది. వీటిలో గెలిచిన టీంలు ఫైనల్లో తలపడనున్నాయి.
టీమ్ ఇండియా ప్లేయింగ్ XI – స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, దీప్తి శర్మ, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: లిజెల్ లీ, లారా వోల్వార్డ్ట్, లారా గూడాల్, సునే లూస్ (కెప్టెన్), మిగ్నాన్ డు ప్రీజ్, మరియన్ కాప్, క్లో ట్రయాన్, త్రిషా చెట్టి, షబ్నిమ్ ఇస్మాయిల్, మసాబాటా క్లాస్, అయాబొంగా ఖాకా.
Also Read: ICC Women ODI Rankings: వన్డే ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన మంధాన-భాటియా.. భారత సారథికి మాత్రం నిరాశే..