Ind Vs Sa: సౌతాఫ్రికాతో తలపడే భారత జట్టు ఇదేనా.. రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి.. సారథిగా ఎవరంటే?

జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జట్టు ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం..

Ind Vs Sa: సౌతాఫ్రికాతో తలపడే భారత జట్టు ఇదేనా.. రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి.. సారథిగా ఎవరంటే?
Ind Vs Sa Virat Kohli Rohit Sharma
Follow us

|

Updated on: May 22, 2022 | 4:53 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022(IPL 2022) తర్వాత భారత క్రికెటర్ల షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్(IND vs SA) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందుకోసం ముంబైలో సెలక్టర్ల సమావేశం నిర్వహించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆఫ్రికా సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌ పర్యటనకు కూడా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. నేడు తుది జట్టుపై ఓ క్లారిటీ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా సిరీస్‌లో విశ్రాంతి లభిస్తుందా లేదా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లతో పాటు రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్‌లకు కూడా విశ్రాంతి ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

Also Read: IPL 2022: ముంబై గెలుపుతో సంబురాలు చేసుకున్న ఆర్‌సీబీ ఆటగాళ్లు.. డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ..

ఇంగ్లండ్ సిరీస్‌ కోసమే విశ్రాంతిని ఇస్తున్నారా?

టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు నిరంతరం క్రికెట్ ఆడుతున్నారు. మూడు ఫార్మాట్లలో భాగంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, పనిభారం నిర్వహణ కారణంగా బోర్డు చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విశ్రాంతి కేవలం ఆఫ్రికా సిరీస్‌కు మాత్రమే పరిమతం చేయనున్నారు. తద్వారా ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఆటగాళ్లకు కొంత సమయం లభిస్తుందని మాజీలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌లో భారత్ ఒక టెస్టు మ్యాచ్ (ఇది గతేడాది సిరీస్‌లో చివరి మ్యాచ్ జరగాల్సి ఉంది), మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో ఇది తొలి విదేశీ పర్యటన కానుంది. టెస్టు జట్టులో భాగమైన ఆటగాళ్లు జూన్ 15 నాటికి ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు టీమిండియా(ప్లేయింగ్ 11 అంచనా)- శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, రీతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, సంజు శాంసన్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్

కెప్టెన్‌గా ఎవరు?

రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ జట్టులో లేకుంటే కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది కూడా ప్రశ్నగా మారింది. శిఖర్ ధావన్ జట్టుకు నాయకత్వం వహించగలడని భావిస్తున్నారు. అతను గతంలో శ్రీలంక సిరీస్‌లో కూడా టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరో పోటీదారుడు హార్దిక్ పాండ్యా కూడా లైన్‌లోకి వచ్చాడు. ఐపీఎల్ 2022లో తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్నాడు. హార్దిక్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్:

తొలి టీ20 – జూన్ 9, ఢిల్లీ

రెండో టీ20 – జూన్ 12, కటక్

మూడవ టీ20 – జూన్ 14, విశాఖపట్నం

నాల్గవ టీ20 – జూన్ 17, రాజ్‌కోట్

ఐదవ టీ20-జూన్ 19, బెంగళూరు

Also Read: ఆయనతో విభేదాలు లేవు.. ఆ వార్తలన్నీ అవాస్తవం: పుకార్లను కొట్టిపారేసిన ఇంగ్లండ్ పేస్ బౌలర్..

India Vs Pakistan: మరికొద్ది గంటల్లో దాయాదుల పోరు.. పాకిస్తాన్‌పై కొత్త జట్టుతో భారత్ సత్తా చాటేనా?