AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయనతో విభేదాలు లేవు.. ఆ వార్తలన్నీ అవాస్తవం: పుకార్లను కొట్టిపారేసిన ఇంగ్లండ్ పేస్ బౌలర్..

Anderson vs Root: వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టును ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించినప్పుడు, జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు అందులో కనిపించలేదు.

ఆయనతో విభేదాలు లేవు.. ఆ వార్తలన్నీ అవాస్తవం: పుకార్లను కొట్టిపారేసిన ఇంగ్లండ్ పేస్ బౌలర్..
England Cricket Team Anderson Vs Root
Venkata Chari
|

Updated on: May 22, 2022 | 4:16 PM

Share

ఇంగ్లండ్ జట్టులోని అత్యంత సీనియర్ సభ్యుడు జేమ్స్ మైఖేల్ ఆండర్సన్, జోసెఫ్ ఎడ్వర్డ్ రూట్‌తో ఉన్న విభేదాలపై స్పందించాడు. ఈ వివాదాలకు సంబందించిన ఊహాగానాలను కొట్టిపారేశాడు. అయితే అండర్సన్‌, రూట్‌ల మధ్య సంబంధాలు అలాగే ఉంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. “మేం మాట్లాడుకుంటున్నాం, మా మధ్య వివాదాలేమీ లేవంటూ లాంక్షైర్ vs యార్క్‌షైర్ మ్యాచ్ సందర్భంగా అండర్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మా ఇద్దరికీ ఒకరిపైఒకరికి చాలా గౌరవం ఉంది. కాబట్టి శత్రుత్వం అనేది మామధ్య లేదంటూ పేర్కొన్నాడు.

Also Read: Viral Video: ఇదేమి బాల్‌రా నాయనా.. మంత్రం వేసినట్టు స్టంప్స్‌నే లేపేసింది.. వైరల్ వీడియో..

నిజానికి, వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టును ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించినప్పుడు, జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు అందులో కనిపించలేదు. అండర్సన్, బ్రాడ్ తమను జట్టు నుంచి తొలగించడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యారు. దీని తర్వాత బహుశా అండర్సన్, జో రూట్ మధ్య ఏదో వివాదం ఉందనే వార్తలు వినిపించాయి. ఎందుకంటే ఆ సమయంలో జో రూట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అండర్సన్‌ను తొలగించే నిర్ణయం కూడా అతనిదే అయి ఉంటుందంటూ వార్తలు వినిపించాయి.

169 టెస్టుల్లో 26.58 సగటుతో 640 వికెట్లు పడగొట్టినప్పటికీ ప్లేయింగ్ XI నుంచి తప్పించడమేంటంటూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు వినిపించాయి. వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్ జట్టు 1-0 తేడాతో టెస్టు సిరీస్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో జో రూట్ టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ నియమితుడయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఓటమి పరిణామాలతో ఇంగ్లండ్ ప్రదర్శన చాలా ఘోరంగా పడిపోయింది. ఇసీబీ, ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల కోసం అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు బలి అయ్యారు. అయితే, ప్లేయింగ్ 11 నుంచి తప్పించడంతో అండర్సన్‌కు అవమానంగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంగ్లండ్ టీంలోనే గ్రేట్ ప్లేయర్‌గా పేరుగాంచాడు. వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో అవమానంగా భావించిన అండర్సన్ రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు వార్తలు వచ్చాయి.

బ్రాడ్, అండర్సన్ కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో న్యూజిలాండ్‌తో స్వదేశీ సిరీస్ కోసం తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ, రూట్‌తో వారి సంబంధం శాశ్వతంగా ఉంటుందా లేదా అనేది చూడాలి. మైదానంలో వీరిద్దరూ ఎలా వ్యవహరిస్తారనే దానిపైనే రాబోయే కాలంలో ఇంగ్లండ్ భవిష్యత్‌ను డిసైడ్ చేస్తుంది.

కాగా, జేమ్స్ అండర్సన్ ఇటీవల కౌంటీ మ్యాచ్‌లో జో రూట్ వికెట్ పడగొట్టాడు. తన అత్యుత్తమ ఇన్-స్వింగ్ బాల్‌తో స్టంప్‌ పడగొట్టాడు. అయితే, ఈ క్రమంలోనే స్టువర్ట బ్రాడ్ చేసిన ఓ ట్వీట్ కూడా తెగ వైరల్ అవుతోంది.

Also Read: India Vs Pakistan: మరికొద్ది గంటల్లో దాయాదుల పోరు.. పాకిస్తాన్‌పై కొత్త జట్టుతో భారత్ సత్తా చాటేనా?

IPL 2022: ముంబై గెలుపుతో సంబురాలు చేసుకున్న ఆర్‌సీబీ ఆటగాళ్లు.. డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ..