భారత అమ్మాయిలు అదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌తో 1-0తో భారత జట్టు ఆధిక్యంలో ని లిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ స్మృతి మంధాన సెంచరీ సహాయంతో 265 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 37.4 ఓవర్లలో కేవలం 122 పరుగులకు ఆలౌటైంది. టీమ్ ఇండియా తరఫున తొలి వన్డే మ్యాచ్ ఆడిన లెగ్ స్పిన్నర్ ఆశా శోభన అత్యధికంగా 4 వికెట్లు తీసి మెరిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టుకు శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఓపెనర్ షఫాలీ వర్మ (7 పరుగులు) వికెట్ కోల్పోయింది. అనంతరం దయాళన్ హేమలత కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 10 పరుగులకే ఔటయ్యింది. జెమీమా, రిచా ఘోష్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయితే స్మృతి మంధాన మాత్రం ఒంటరి పోరాటం చేసింది. సఫారీ బౌలర్లను చితక బాదుతూ సెంచరీ కొట్టింది. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసింది.
266 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కూడా ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్ లోనే కెప్టెన్ లారా వోల్వార్డ్ ను రేణుక క్లీన్ బౌల్డ్ చేసింది. 33 పరుగులకు చేరుకునే సమయానికి జట్టు 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. అనుభవజ్ఞురాలైన మరిజన్నే కప్ 24 పరుగులు చేయడం ద్వారా జట్టు ఇన్నింగ్స్‌కు కొంత బలం చేకూర్చింది. అయితే ఈ వికెట్ పతనం తర్వాత ఆఫ్రికా జట్టు కుప్పకూలింది. సినలోవా జఫ్తా 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
రెండు జట్లు
దక్షిణాఫ్రికా జట్టు:
లారా వోల్‌వార్డ్ట్, తజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బాష్, సునే లూస్, మరిజాన్నె కెప్, అన్నేరీ డెర్క్‌సెన్, నందుమిసో షాంగసే, సినాలో జఫ్తా, మసాబటా క్లాస్ అయాబొంగా ఝాకా, నంకులులేకో మ్లాబా
టీమ్ ఇండియా:
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, డి హేమలత, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, ఎస్. ఆశా, రేణుకా సింగ్.
Vice-captain Smriti Mandhana scored a superb ton to set up #TeamIndia‘s win & bagged the Player of the Match award in the 1⃣st #INDvSA ODI 👏 👏
Scorecard ▶️ https://t.co/EbYe44lVao@mandhana_smriti | @IDFCFIRSTBank pic.twitter.com/7p5lL7MQMy
— BCCI Women (@BCCIWomen) June 16, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..