U19 World Cup: సహరన్ ‘షాన్‌ దార్‌’ ఇన్నింగ్స్‌.. ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన యంగ్ టీమిండియా

యంగ్‌ టీమిండియా అదరగొట్టింది. ప్రతిష్ఠాత్మక అండర్‌ 19 ప్రపంచకప్‌ దూసుకెళ్లింది. మంగళవారం (ఫిబ్రవరి 06) సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐదోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 

U19 World Cup: సహరన్ షాన్‌ దార్‌ ఇన్నింగ్స్‌.. ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన యంగ్ టీమిండియా
Team India

Updated on: Feb 06, 2024 | 9:48 PM

యంగ్‌ టీమిండియా అదరగొట్టింది. ప్రతిష్ఠాత్మక అండర్‌ 19 ప్రపంచకప్‌ దూసుకెళ్లింది. మంగళవారం (ఫిబ్రవరి 06) సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐదోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్ లో  బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యంగ్ టీమిండియా.. 48.5 ఓవర్లలో టార్గెట్‌ పూర్తి చేసి విజయాన్ని అందుకుంది. సచిన్‌ ధాస్‌ (96), ఉదయ్‌ (81) అర్ధశతకాలతో జట్టు విజయంలో  ప్రధాన పాత్ర పోషించారు.  ఇక రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. టోర్నీలో గ్రూప్‌ స్టేజ్‌ నుంచి సూపర్‌ సిక్స్‌ వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమ్‌ఇండియా.. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి సవాల్‌ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బెనోనిలో జరిగిన ఈ సెమీ-ఫైనల్‌లో, టీమిండియా బౌలర్లు మొదట దక్షిణాఫ్రికాను కేవలం 244 పరుగులకే పరిమితం చేశారు. అయితే లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది, అయితే  కెప్టెన్ సహారన్ ఉదయ్, సచిన్ 171 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో భారత్ కు  చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

 

ఇవి కూడా చదవండి

 

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా త్వరగానే  4 టాపార్డర్ వికెట్లు కోల్పోయింది. ఆదర్శ్ సింగ్ 0, ముషీర్ ఖాన్ 4, అర్షీన్ కులకర్ణి 4, ప్రియాంషు సహారన్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో టీమిండియా 40 పరుగుల్లోపే 4 కీలక వికెట్లును చేజార్చుకుంది.  అయితే ఆ తర్వాత సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహారన్ ఇద్దరూ టీమ్ ఇండియా విజయానికి పునాది వేశారు. వీరిద్దరూ వ్యక్తిగత హాఫ్ సెంచరీలు సాధించారు.  ఇద్దరూ ఐదో వికెట్‌కి 171 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో సచిన్ ఔటయ్యాడు. సచిన్ 95 బంతుల్లో 96 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆరవెల్లి అవినాష్ 10 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత ముర్గన్ అభిషేక్ సున్నాకి రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్‌ మరింత రసవత్తరంగా మారింది. కానీ రాజ్ లింబానీతో కెప్టెన్ ఉదయ్ టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు.  మరోవైపు దక్షిణాఫ్రికా కూడా ధీటుగా పోరాడింది. సౌతాఫ్రికా బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. కానీ టీమ్ ఇండియా ముందు తలవంచకతప్పలేదు. దక్షిణాఫ్రికా తరఫున ట్రిస్టన్ లూస్, క్వేనా మఫాకా చెరో 3 వికెట్లు తీశారు.

ఐదోసారి ప్రపంచకప్ ఫైనల్ కు..

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ..

టీమ్ ఇండియా ప్లేయింగ్ XI :

ఉదయ్ సహారన్ (కెప్టెన్), ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ముషీర్ ఖాన్, అరవెల్లి అవనీష్ (వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ మరియు సౌమ్య పాండే.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI :

జువాన్ జేమ్స్ (కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్ (వికెట్ కీపర్), స్టీవ్ స్టోల్క్, డేవిడ్ టీగర్, రిచర్డ్ సెలెట్స్‌వైన్, దేవాన్ మరైస్, ఆలివర్ వైట్‌హెడ్, రిలే నార్టన్, ట్రిస్టన్ లూస్, న్కోబానీ మోకోనా మరియు క్వేనా మఫాకా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us