IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్ మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సౌతాఫ్రికా మొదటగా బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్‌కి 288 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. సౌతాఫ్రికా ఆటగాళ్లలో క్వింటన్ డి కాక్ సెంచరీతో రాణించగా, రస్సెన్ వాన్ డస్సెన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, దీపక్ చాహర్ 2, బుమ్రా 2, యజ్వేంద్ర చాహల్ 1 వికెట్ సాధించారు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికాకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జానెమన్ మలన్ చాహర్ బౌలింగ్‌లో1 పరుగుకే ఔటయ్యాడు. తర్వాత టెంబా బావుమాని రాహుల్ రనౌట్ చేశాడు. మార్‌క్రమ్ కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో భారమంతా క్వింటన్ డి కాక్, రస్పెన్ వాన్ డస్సెన్ పై పడింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కి సెంచరీ పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే డి కాక్ సెంచరీ పూర్తి చేశాడు. 130 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. డస్సెన్ 59 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. వీరిద్దరు ఔట్ అయ్యాక ఎవ్వరు పెద్దగా రణించలేదు. చివరలో ఒక్క డేవిడ్ మిల్లర్ 39 పరుగులతో (38 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) పర్వాలేదనిపించాడు. దీంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే 287 పరుగులకు ఆలౌట్ అయింది.