
India vs South Africa, 1st Test: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతోంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం మ్యాచ్ మొదటి రోజు, చివరి సెషన్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులకు ఆలౌట్ అయింది.
జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజ్ (0), సైమన్ హార్మర్ (5), టోనీ డి జార్జి (24), ఐడెన్ మార్క్రామ్ (31), ర్యాన్ రికెల్టన్ (23) లను అవుట్ చేశాడు.
టీ-బ్రేక్ కు ముందు, అక్షర్ పటేల్ కార్బిన్ బోస్ (3 పరుగులు) ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. మహమ్మద్ సిరాజ్ మార్కో జాన్సెన్ (0), వికెట్ కీపర్ కైల్ వెర్రెయిన్ (16 పరుగులు) లను అవుట్ చేయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టి వియాన్ ముల్డర్ (24 పరుగులు), కెప్టెన్ టెంబా బావుమా (3 పరుగులు) లను అవుట్ చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..