
Shubman Gill Injury Update: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు శుభ్‌మాన్ గిల్‌కు తగిలిన గాయం టీమింయాలో టెన్షన్‌ను మరింత పెంచింది. 2025 ఆసియా కప్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమితుడైన గిల్ శిక్షణ సమయంలో గాయపడ్డాడు. గిల్ చేతిలో గాయమైంది. ఆ తర్వాత అతను నొప్పితో బాధపడ్డాడు. యూఏఈతో జరిగిన టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో గిల్ మంచి టచ్‌లో కనిపించాడు. ఇటువంటి పరిస్థితిలో, పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు అతని గాయం భారత జట్టును టెన్షన్ పడుతోంది.
శుభ్‌మాన్ గిల్ గాయపడిన తర్వాత నెట్స్‌లో గందరగోళం నెలకొంది. జట్టు ఫిజియో అతని వద్దకు వెళ్లి అతని గాయాన్ని పర్యవేక్షించారు. గాయపడిన తర్వాత గిల్ నెట్స్‌ను విడిచిపెట్టాడు. గాయపడిన చేతిని పట్టుకుని ఐస్ బాక్స్‌పై కూర్చుని కనిపించాడు. ఆ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ అతని గాయం గురించి అడుగుతూ కనిపించారు. అభిషేక్ శర్మ ఒక వాటర్ బాటిల్ తెరిచి అతనికి తాగడానికి ఇచ్చాడు.
గిల్ గాయం అంత తీవ్రంగా లేదు. కొన్ని నిమిషాల తర్వాత అతను మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి నెట్స్‌కు తిరిగి వచ్చాడు. ప్రాక్టీస్ సమయంలో, జట్టు ఫిజియో అతనిపై నిఘా ఉంచాడు. అతను నిరంతరం అతనిని పర్యవేక్షించాడు. మొత్తంమీద, టీం ఇండియా దృక్కోణం నుంచి భయపడటానికి ఏం లేదని చెప్పవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..