Watch Video: ఛేజింగ్ మాస్టర్ విశ్వరూపం.. మైదానంలోనే భుజానికి ఎత్తుకున్న రోహిత్.. వీడియో చూస్తే..

|

Oct 23, 2022 | 6:15 PM

పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. విజయం తర్వాత రోహిత్, కోహ్లీ సంబరాలు చేసుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Watch Video: ఛేజింగ్ మాస్టర్ విశ్వరూపం.. మైదానంలోనే భుజానికి ఎత్తుకున్న రోహిత్.. వీడియో చూస్తే..
Virat Kohli Rohit
Follow us on

టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు అద్భుత విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మెల్ బోర్న్ మైదానంలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి విజయం సాధించి ఛేజింగ్ మాస్టర్‌గా ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించుకున్నాడు. కోహ్లీ కీలక ఈ ఇన్నింగ్స్ కెప్టెన్ రోహిత్ శర్మను చాలా సంతోషపెట్టింది. అతను తన స్టార్ ప్లేయర్‌ను మైదానంలోనే ఎత్తుకుని, గిరగిరా తిప్పేశాడు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ రోహిత్‌ శర్మతో విభేదాలు వచ్చినట్లు చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ, మెల్‌బోర్న్‌ మైదానంలో కనిపించిన దృశ్యం వీరిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయో లేదో కానీ టీమిండియా ఫ్యాన్స్‌కు మాత్రం పాజిటివ్ సిగ్నల్ ఇచ్చేశారు.

కోహ్లీని భుజం మీద ఎత్తుకున్న రోహిత్..

చివరి బంతి వరకు వెళ్లిన ఈమ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయాన్ని అందుకోగా.. కోహ్లి ఎప్పటిలాగే తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. పంచ్‌లతో నేలకొరిగి తన దూకుడును ప్రదర్శించాడు. అదే సమయంలో మైదానంలోకి వచ్చిన రోహిత్ కోహ్లీని చూసి ఆగలేకపోయాడు. ముందుగా కోహ్లిని కౌగిలించుకుని ఆ తర్వాత భుజంపై ఎత్తుకున్నాడు. చిన్నపిల్లాడిలా కోహ్లిని భుజానికి వేసుకుని నడవడం మొదలుపెట్టాడు. మైదానంలో ఈ సీన్ చూసిన ఏ అభిమానైనా భావోద్వేగానికి లోనవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

చివరి ఓవర్లలో మ్యాచ్‌ని మలుపు తిప్పిన కోహ్లీ..

భారత జట్టు గెలవాలంటే 160 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, టాప్ ఆర్డర్‌లోని ముగ్గురు బ్యాట్స్‌మెన్ కేవలం 26 పరుగులకే వెనుదిరిగారు. ఆ సమయంలో క్రీజులో ఉన్న కోహ్లి.. టీమిండియాకు విజయాన్ని అందించిన తర్వాతే వెనుదిరిగాడు. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో అతను 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. చివరి మూడు ఓవర్లలో కోహ్లి మ్యాచ్‌ను తలకిందులు చేశాడు.

చిత్తయిన పాక్..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పాకిస్థాన్ తరపున షాన్ మసూద్ అజేయంగా 52, ఇఫ్తికార్ అహ్మద్ 51 పరుగులు చేశారు. భారత్‌ తరపున అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లు తీయగా, మహమ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌ ఒక్కో వికెట్‌ తీశారు.