IND vs PAK: 30 ఏళ్ల చెత్త రికార్డులో పాకిస్తాన్ సారథి.. అర్షదీప్ దెబ్బకు గోల్డెన్ డక్..

ఈ మ్యాచ్‌లో బాబర్ ఖాతా కూడా తెరవలేక తొలి బంతికే ఔటయ్యాడు. అతను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అర్ష్‌దీప్ అతడిని అవుట్ చేశాడు. బాబర్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.

IND vs PAK: 30 ఏళ్ల చెత్త రికార్డులో పాకిస్తాన్ సారథి.. అర్షదీప్ దెబ్బకు గోల్డెన్ డక్..
Ind Vs Pak Babar Azam

Updated on: Oct 23, 2022 | 4:21 PM

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై పాకిస్థాన్‌కు అవసరమైన ఆరంభం లభించలేదు. కెప్టెన్ బాబర్ ఆజం కూడా టాస్ గెలవడంలో విఫలమై, ఆ తర్వాత తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో తన పేరిట అనవసర రికార్డును సృష్టించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో బాబర్ ఖాతా కూడా తెరవలేక తొలి బంతికే ఔటయ్యాడు. అతను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అర్ష్‌దీప్ అతడిని అవుట్ చేశాడు. బాబర్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో బాబర్ ఇమ్రాన్ ఖాన్‌ను సమం చేశాడు.

ఇమ్రాన్ ఖాన్ తర్వాత ఏ ప్రపంచకప్‌లోనైనా భారత్‌పై ఖాతా తెరవకుండానే అవుట్ అయిన రెండో పాక్ కెప్టెన్‌గా బాబర్ నిలిచాడు.

ఇవి కూడా చదవండి

1992లో ఆడిన వన్డే ప్రపంచకప్‌లో ఐదు బంతులు ఆడినా ఇమ్రాన్ ఖాన్ ఖాతా తెరవలేకపోయాడు. అతను రనౌట్ అయ్యాడు. అతడిని వెంకటపతి రాజు, వికెట్ కీపర్ కిరణ్ మోరే ఔట్ చేశారు.

అంటే 30 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు.