jasprit Bumrah – Shaheen Shah Afridi: వరుసగా రెండోసారి ఆసియా కప్‌లో వర్షం కారణంగా భారత్, పాకిస్థాన్ క్రికెటర్లతోపాటు అభిమానులు నిరాశకు గురయ్యారు. క్యాండీలో జరిగిన గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ పూర్తి కాలేదు. అయితే సెప్టెంబర్ 10 ఆదివారం కొలంబోలో జరిగిన సూపర్-4 రౌండ్ మ్యాచ్‌లో వర్షం కురువడంతో మ్యాచ్ రిజర్వ్ డేకి వాయిదా వేయవలసి వచ్చింది. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ ఆటగాళ్లు, అభిమానులకు ఇబ్బందికరంగానే ఉంది. అయితే, మ్యాచ్ వాయిదా పడిన తర్వాత అందరి హృదయాలను గెలుచుకున్న దృశ్యం కనిపించింది. పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది ఇటీవలే తండ్రి అయిన టీమిండియా దిగ్గజ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా తొలిసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య సంజనా గణేశన్ సెప్టెంబర్ 4న మగబిడ్డకు జన్మనిచ్చింది. తన జీవితంలోని ఈ ప్రత్యేక సందర్భం కోసం, బుమ్రా ఆసియా కప్ మధ్యలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. దీని కారణంగా అతను 4వ తేదీన నేపాల్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. కొడుకు అంగద్‌కు జన్మనిచ్చిన శుభవార్త బుమ్రా ట్వీట్‌లో తెలిపారు.
Spreading joy 🙌
Shaheen Afridi delivers smiles to new dad Jasprit Bumrah 👶🏼🎁#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/Nx04tdegjX
— Pakistan Cricket (@TheRealPCB) September 10, 2023
ఈ శుభవార్తతో టీమ్ ఇండియా సహచరులు బుమ్రాకు మద్దతు ఇవ్వడమే కాకుండా, ఇప్పుడు పాకిస్తాన్ పేసర్ షాహీన్ కూడా ఈ ప్రత్యేక విజయానికి తన సీనియర్‌ను అభినందించాడు. వర్షం కారణంగా ఆదివారం మ్యాచ్ వాయిదా పడిన తర్వాత, రెండు జట్లు తిరిగి హోటల్‌కి వెళ్తున్నప్పుడు, షాహీన్ బుమ్రా కుమారుడికి బహుమతిగా ఓ బాక్స్ అందించాడు. బుమ్రా వద్దకు ఆ బాక్స్ తీసుకుని వచ్చి అందించాడు.
షాహీన్ బుమ్రాకి ఈ గిఫ్ట్ ఇచ్చి తండ్రి అయినందుకు అభినందించాడు. అంతేకాదు ఈ సందర్భంగా షాహీన్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. అల్లా బుమ్రా కొడుకును ఆశీర్వదిస్తాడని, కొత్త బుమ్రా (అంటే తండ్రి లాంటి బౌలర్) అవుతాడని షాహీన్ బుమ్రాతో చెప్పుకొచ్చాడు. ఈ బహుమతి అందుకున్న బుమ్రా.. షాహీన్‌కి కృతజ్ఞతలు తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..