IND vs NZ: కాన్పూర్‌లో అక్షర్ విధ్వంసం.. 7 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు.. దిగ్గజాల సరసన చేరిన యంగ్ బౌలర్

|

Nov 28, 2021 | 8:04 AM

Axar Patel: వికెట్ల వేటలో అక్షర్ పటేల్ విజయవంతం అయ్యాడు. తక్కువ టెస్టుల్లోనే ఐదుసార్లు 5 వికెట్లు పడగొట్టి దిగ్గజాల సరసన చేరాడు.

IND vs NZ: కాన్పూర్‌లో అక్షర్ విధ్వంసం.. 7 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు.. దిగ్గజాల సరసన చేరిన యంగ్ బౌలర్
Ind Vs Nz Axar Patel
Follow us on

Axar Patel: సుమారు 9 నెలల క్రితం టీమ్ ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్.. భారత పిచ్‌పై విదేశీ బ్యాట్స్‌మెన్‌లకు ఓ పజిల్‌గా నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్రం సిరీస్‌లో రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్.. కాన్పూర్ టెస్టు మూడో రోజు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌‌కు చుక్కలు చూపించాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి దిగ్గజ స్పిన్నర్ల సమక్షంలో అక్షర్ మరోసారి విధ్వంసం సృష్టించి, న్యూజిలాండ్ జట్టులో సగం మందిని పెవిలియన్‌కు చేర్చి, టీమ్ ఇండియాను పోటీలో నిలిపాడు. అలాగే అతని అత్యుత్తమ రికార్డును మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు.

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమ్ ఇండియా ఎలాంటి విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ, మూడో రోజు భారత బౌలర్లు అద్భుతంగా పునరాగమనం చేసి వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు తీయడం ప్రారంభించాడు. అయితే అంతకుముందు ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ ఆధిపత్యం చెలాయించాడు. అతను న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. కేవలం 4 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు.

అక్షర్ పటేల్ హవా..
అక్షర్ పటేల్ తన మొదటి వికెట్‌గా న్యూజిలాండ్ టీంకు అత్యంత అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్‌‌ను పెవిలియన్ చేర్చాడు. అతను వికెట్ కీపర్ కేఎస్ భరత్ క్యాచ్ పట్టాడు. దీని తరువాత, హెన్రీ నికోల్స్‌ను తన రెండవ వికెట్ కూడా పొందాడు. కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ రూపంలో భారత స్పిన్నర్ కీలకమైన వికెట్‌ను పడగొట్టాడు. లెంగ్త్, స్పీడ్‌ను మారుస్తూ అక్షర్‌కి క్యాచ్ ఇచ్చి స్టంపౌట్ అయ్యాడు. విశేషమేమిటంటే.. సెంచరీ పూర్తి చేసేందుకు మరో ఐదు పరుగుల దూరంలో లాథమ్‌ను పెవిలియన్ చేర్చాడు. 95 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆపై అక్షర్ బౌలింగ్ లో టామ్ బ్లండెల్, టిమ్ సౌథీలు పెవిలియన్ చేరాడు.

కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదోసారి..
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన చెన్నై టెస్టులో అరంగేట్రం చేసిన అక్షర్.. కెరీర్‌లో నాలుగో టెస్టులోనే ఐదోసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ కేవలం ఏడో ఇన్నింగ్స్‌లో ఐదోసారి ఈ ఫీట్ చేసి దిగ్గజ బౌలర్ల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. అతను ఐదు సార్లు తక్కువ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన విషయంలో చార్లీ టర్నర్, టామ్ రిచర్డ్‌సన్‌లతో కలిసి రెండవ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ రోడ్నీ హాగ్ కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

Also Read: India Vs South Africa 2021: దక్షిణాఫ్రికా పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్.. బీసీసీఐతో ఏం చెప్పిందంటే?

IND vs NZ 1st Test, Day 3: మూడో రోజు ఆధిపాత్యాన్ని ప్రదర్శించిన భారత బౌలర్లు.. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో..