IND vs NZ: కివీస్‌కు ఈసారి బడిత పూజే.. సూర్యసేనకు ట్రోఫీ అందించే 4 గుడ్‌న్యూస్‌లు ఇవే..?

T20 World Cup 2026 Final: భారత జట్టు ఐసీసీ టోర్నీల్లో కివీస్ జట్టుపై పరాజయం పాలవుతూనే ఉంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 ఓడిపోయింది. కానీ, ఈసారి లెక్కలు మార్చాలని సూర్యసేన కోరుకుంటోంది. ఈ క్రమంలో భారత జట్టుకు 4 గుడ్ సైన్స్ కనిపిస్తున్నాయి.

IND vs NZ: కివీస్‌కు ఈసారి బడిత పూజే.. సూర్యసేనకు ట్రోఫీ అందించే 4 గుడ్‌న్యూస్‌లు ఇవే..?
Team India

Updated on: Mar 07, 2026 | 11:28 AM

T20 World Cup 2026 Final: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. నిజానికి, టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ, మార్చి 8న అహ్మదాబాద్‌లో ఈ చరిత్ర మారబోతోందా..? భారత అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్న ఆ 4 సమీకరణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టైటిల్ పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. కివీస్‌పై ఉన్న చెత్త రికార్డును చెరిపేసి, భారత్ విజేతగా నిలుస్తుందని చెప్పడానికి కొన్ని సమీకరణాలు బలంగా కనిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

1. జింబాబ్వే – ఆస్ట్రేలియా సెంటిమెంట్: వైట్ బాల్ క్రికెట్ హిస్టరీలో ఒక వింత సెంటిమెంట్ ఉంది. వరల్డ్ కప్‌లో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను ఓడించినప్పుడల్లా భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. 1983 వన్డే వరల్డ్ కప్, 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇదే జరిగింది. ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్‌లో కూడా జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. అందుకే భారత్ మళ్ళీ ఛాంపియన్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

2. ఆతిథ్య దేశం (Home Team) రికార్డు: 2011 వన్డే వరల్డ్ కప్‌లో సొంత గడ్డపై ఆడి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఆతిథ్య దేశం కూడా కప్పు గెలవలేదు. ఒకవేళ 2011 నాటి చరిత్రను పునరావృతం చేస్తే, టీ20 వరల్డ్ కప్‌లో ఈ ఘనత సాధించిన మొదటి హోమ్ టీమ్‌గా భారత్ నిలుస్తుంది.

3. సౌతాఫ్రికా ఓటమి మ్యాజిక్: వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా కేవలం సౌతాఫ్రికాతో మాత్రమే ఓడిపోయిన సందర్భాల్లో టైటిల్ గెలిచింది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ కేవలం ప్రోటీస్ జట్టు చేతిలోనే ఓడింది. ఆ తర్వాత ఛాంపియన్‌గా నిలిచింది. ఈ 2026 టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత్ ఇప్పటివరకు కేవలం సౌతాఫ్రికా చేతిలోనే ఓటమి చవిచూసింది. ఈ లెక్కన ఫైనల్‌లో భారత్‌దే విజయం అనిపిస్తోంది.

4. భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ ట్రెండ్: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ జరిగినప్పుడల్లా, అందులో గెలిచిన జట్టునే టైటిల్ వరించింది. 2022లో ఇంగ్లాండ్ గెలిచి ఛాంపియన్ అయ్యింది. 2024లో భారత్ గెలిచి విజేతగా నిలిచింది. ఇప్పుడు 2026 సెమీఫైనల్లో భారత్ మళ్ళీ ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ ట్రెండ్ కొనసాగితే ఈసారి కూడా కప్పు మనదే!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us