Video: ఇదేంది రోహిత్ భయ్యా.. ఈజీ క్యాచ్‌ని ఇలా డ్రాప్ చేస్తావా.. ఇంచు కూడా కదలకుండా చూస్తుండిపోయావుగా..

|

Oct 26, 2024 | 11:14 AM

Rohit Sharma: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య పూణె టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్లిప్‌లో ఉన్న అశ్విన్ బంతికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ పట్టకుండా అలాగే చూస్తుండిపోయాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు రోహిత్ ఈ చర్యపై విమర్శలు గుప్పిస్తూ రిటైర్మెంట్ చేయమంటూ సూచిస్తున్నారు.

Video: ఇదేంది రోహిత్ భయ్యా.. ఈజీ క్యాచ్‌ని ఇలా డ్రాప్ చేస్తావా.. ఇంచు కూడా కదలకుండా చూస్తుండిపోయావుగా..
Rohit Sharma Video
Follow us on

IND vs NZ 2nd Test: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మకు ఇప్పటివరకు ప్రత్యేకమైనదిగా మారలేదు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఖాతా కూడా తెరవలేకపోయాడు. పుణె మైదానంలో మూడో రోజు న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ పట్టేందుకు కూడా ప్రయత్నించలేదు. మూడో రోజు రెండవ ఓవర్‌లోనే ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. క్యాచ్ పట్టకుండా అలాగే, నిలబడి చూస్తున్నాడు. రోహిత్ శర్మ ఈ క్యాచ్ పట్టని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సులువైన క్యాచ్‌ను వదిలేసిన రోహిత్ శర్మ..

నిజానికి మ్యాచ్ రెండో రోజు ముగిసే సమయానికి టీమిండియా ఇప్పటికే 300 పరుగుల వెనుకంజలో ఉంది. ఆ తర్వాత, అశ్విన్ మూడో రోజు ఆటలో రెండవ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అతని రెండవ బంతి గ్లెన్ ఫిలిప్స్ బ్యాట్ వెలుపలి అంచుని తీసుకుంది. దీంతో బంతి గాలిలోకి స్లిప్ వైపు వెళ్లింది. కానీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన ప్లేస్ నుంచి కదలకుండా కేవలం బంతి వైపు చూస్తూనే ఉన్నాడు. రోహిత్ ఈ చర్య కారణంగా బౌలింగ్ చేస్తున్న అశ్విన్ కూడా చాలా నిరాశకు గురయ్యాడు. కాగా రోహిత్ శర్మ సులువైన క్యాచ్‌ను వదిలేయడంతో అభిమానులు అతడిని ఏకిపారేస్తున్నారు.

టీమిండియా టార్గెట్ 359..

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ తరపున మిచెల్ సాంట్నర్ అత్యధికంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో.. టీమిండియాకు 359 పరుగుల టార్గెట్ ఇచ్చింది. పూణె టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించాలంటే ఈ భారీ టార్గెట్‌ను ఛేదించాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..