
దుబాయ్‌లో ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ ముగించిన తర్వాత టీం ఇండియా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ అతన్ని కౌగిలించుకున్నాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఫైనల్ తర్వాత జడేజా వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
అయితే, జడేజాను కౌగిలించుకున్న కోహ్లీ.. రిటైర్మెంట్ వార్తలకు ఆజ్యం పోసినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా అశ్విన్ రిటైర్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్‌ను కూడా ఇలాగే హగ్ చేసుకున్న కోహ్లీ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో జడేజా రిటైర్మెంట్ చేస్తాడని అంతా భావిస్తున్నారు.
సౌరాష్ట్ర ఆల్ రౌండర్ కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-0-30-1తో ఆకట్టుకున్నాడు. 30 బంతుల్లో 14 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఈ సౌత్‌పా ఇప్పటికే టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే కోహ్లీ, రోహిత్ శర్మ కూడా వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. జడేజా 2009లో అరంగేట్రం చేసి ఇప్పటివరకు 204 వన్డేలు ఆడాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో మెన్ ఇన్ బ్లూ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
So jadeja is retiring along with rohit and Kohli??
— The Story (@BakwasStory) March 9, 2025
Nothing scares me more than Virat Kohli hugging a senior player for no reason in the last few months 🥺 pic.twitter.com/W0JT0r7ipT
— Sameer Allana (@HitmanCricket) March 9, 2025
🚨 Breaking 🚨
Ravindra Jadeja announces his ODI retirement
(Source-Virat Kohli Hug) pic.twitter.com/SWBJmrDsio
— Shah (@IamShah102) March 9, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..