India Vs New Zealand 2021: న్యూజిలాండ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచి విజయం దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. మ్యాచ్ చివరి రోజున భారత్ 9 వికెట్లు తీయాల్సి ఉండగా, న్యూజిలాండ్ 280 పరుగులు చేయాల్సి ఉంది. సహజంగానే టీమ్ ఇండియాదే పైచేయిగా నిలిచింది. భారత శిబిరం దానితో సంతోషంగా ఉంటుంది. ఇదిలావుండగా, టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ముందు ఓ సమస్య నెలకొంది. ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలి. కాన్పూర్ టెస్ట్ మొదటి రోజు నుంచి వ్యాఖ్యాతలు, భారత క్రికెట్ అభిమానులు ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. ఇది నాల్గవ రోజు ఆటలో మరింత ప్రాధాన్యంగా కనిపించింది. ముంబై టెస్ట్‌లో విరాట్ కోహ్లీని ఏ ఆటగాడు భర్తీ చేస్తాడు? సాధారణంగా ఈ ప్రశ్న పెద్దగా కలవరపెట్టకూడదు. కానీ, ప్రస్తుతం భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇదే అతిపెద్ద తలనొప్పిగా మారింది. దీనికి కారణం చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేల ఫామ్.
కాన్పూర్ టెస్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో, జట్టులోని ఇద్దరు సీనియర్ బ్యాట్స్‌మెన్, అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా పరుగులు చేయడంలో ఎక్కువ బాధ్యత చూపించాల్సిన అవసరం ఉంది. కానీ, అలా జరగలేదు. అయితే ఈ సంవత్సరం మొత్తం, ఈ ఇద్దరి బ్యాట్‌లు మౌనంగా ఉన్నాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మంచి ఆరంభం తర్వాత పుజారా తన వికెట్‌ను కోల్పోగా, అతని కంటే అధ్వాన్నంగా రాణిస్తున్న రహానే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. అదే సమయంలో అతనితో పోలిస్తే అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు.
పుజారా-రహానేల యుగం పూర్తయిందా..
జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారని అంగీకరించారుడు. అయితే వారు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాల్గవ రోజు ఆట ముగిసిన తర్వాత, రాథోడ్ మాట్లాడుతూ, “సహజంగానే టాప్ ఆర్డర్ నుంచి సహకారం కావాలి. కానీ పుజారా, రహానే మాత్రం పరుగులు అందించడంలో విఫలమయ్యారు. ఈ ఇద్దరికి ఎన్నో టెస్టులు ఆడిన అనుభవం ఉంది. ఖచ్చితంగా ఫాంలోకి వస్తారు’ అని పేర్కొన్నాడు.
“ప్రస్తుతం ఇద్దరూ చెడ్డ దశలో ఉన్నారని మేము అర్థం చేసుకున్నాం. అయితే వారు గతంలో భారత్ తరపున ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడారని గుర్తుంచుకోవాలి. వారు ఫాంలోకి తిరిగి వచ్చి మా కోసం ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడుతాడని మాకు నమ్మకం ఉంది’ అని తెలిపాడు. ఈ ఏడాది రహానే 19 పరుగులు మాత్రమే చేశాడు. పుజారా సగటు 30గా ఉంది. ఇలాంటి పరిస్థితిలో జట్టు వారికి కొండంత అండగా ఉంటుంది. కేవలం సంఖ్యలతోనే వారి ఆటను తప్పుపట్టలేం అంటూ ఆయన తెలిపాడు.
కోహ్లి కోసం తప్పుకోనుంది ఎవరు?
తొలి టెస్టు నుంచి రెస్ట్ తీసుకున్న కెప్టెన్ కోహ్లి.. ముంబై టెస్టులో మళ్లీ జట్టులోకి రానున్నాడు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక బ్యాట్స్‌మెన్ స్థానాన్ని ఖాళీ చేయడం భారత జట్టుకు సవాలుగా మారింది. అయితే ఈ ప్రశ్నకు కోచ్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా.. కాన్పూర్ టెస్టుపైనే దృష్టి సారించామని చెప్పి వాయిదా వేశాడు. రాథోడ్ మాట్లాడుతూ, “కెప్టెన్ తిరిగి వస్తున్నాడు. అది తదుపరి మ్యాచ్‌లో ఉంటుంది. మేం ముంబైకి చేరుకున్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఈ మ్యాచ్‌పై దృష్టి సారించాం. ఒక్కరోజు మిగిలి ఉంది, ముందు మ్యాచ్ గెలవాలి. ముంబయి చేరుకున్నాక దాని గురించి మాట్లాడుకుంటాం’’ అని సమాధానం దాటవేశాడు.
ఈ ఏడాది టీమ్ ఇండియా మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే ఎక్కువ పరుగులు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, లోయర్ ఆర్డర్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ల బ్యాట్‌ల నుంచి మాత్రమే వచ్చాయి. కెప్టెన్ కోహ్లి కూడా అంతగా ఫామ్‌లో లేడు. అటువంటి పరిస్థితిలో, కోహ్లి కూడా ఈ సంవత్సరాన్ని మెరుగైన మార్గంలో ముగించాలనుకుంటున్నాడు.
Wriddiman Saha: మెడ నొప్పి వేధిస్తున్నా నిలబడిన సాహా.. ట్విట్టర్లో ప్రశంసలు..