India vs New Zealand: భారత్ వర్సెస్ కివీస్ టీ20 మ్యాచ్ చూడాలంటే అది తప్పనిసరి.. రేపటి నుంచే టికెట్ల సేల్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

|

Nov 10, 2021 | 4:19 PM

Sawai Mansingh Stadium: ఇటీవల రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ 100శాతం ప్రేక్షకుల సమక్షంలో టీ20 మ్యాచ్ నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. కరోనా కొత్త మార్గదర్శకాల ప్రకారం..

India vs New Zealand: భారత్ వర్సెస్ కివీస్ టీ20 మ్యాచ్ చూడాలంటే అది తప్పనిసరి.. రేపటి నుంచే టికెట్ల సేల్.. ధరలు ఎలా ఉన్నాయంటే?
Sawai Mansingh Stadium, Jaipur
Follow us on

Sawai Mansingh Stadium, Jaipur: రాజస్థాన్ క్రీడా ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నవంబర్ 17న జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్‌ స్టేడియంలో జరగనున్న టీ20 మ్యాచ్‌లో ప్రేక్షకుల హాజరయ్యేందుకు హోం శాఖ అనుమతి ఇచ్చింది. కరోనా మార్గదర్శకాల ప్రకారం, ప్రేక్షకులు ఫీల్డ్‌లోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు మాత్రమే భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌ను మైదానంలో కూర్చొని చూడగలుగుతారు. ఇటీవల రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ 100శాతం ప్రేక్షకుల సమక్షంలో టీ20 మ్యాచ్ నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. కరోనా కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం నుంచి పేటీఎంలో (Paytm)ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మహేంద్ర శర్మ వెల్లడించారు. ‘ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత టిక్కెట్ల విక్రయాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం ఆఫ్‌లైన్ కౌంటర్లతో పాటు ఆన్‌లైన్ విక్రయాలను కూడా ప్రారంభిస్తాం. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో 28 వేల మందికి పైగా ప్రేక్షకులు కూర్చునే ఏర్పాటు చేసినట్లు’ శర్మ తెలిపారు.

ఎస్‌ఎంఎస్ స్టేడియంలో గ్రౌండ్, పిచ్‌తో పాటు, ప్రేక్షకుల కోసం సీటింగ్ ఏర్పాటును కూడా మెరుగుపరుస్తున్నారు. దీంతో ప్రేక్షకులు మ్యాచ్‌ను హాయిగా ఆస్వాదించే ఛాన్స్ ఉంది. ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉన్న ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు అనుమతిస్తామని ఆర్‌సీఏ సెక్రటరీ మహేంద్ర శర్మ తెలిపారు.

8 సంవత్సరాల తర్వాత జైపూర్‌లో జరగనున్న అంతర్జాతీయ మ్యాచ్‌లో టిక్కెట్ల ధర 40 నుంచి 100శాతం వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి మైదానంలో మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఖర్చు చెల్లించాల్సి ఉంటుంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సారి టికెట్ రేట్లను 40 నుంచి 100శాతం వరకు పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి రూ.500 స్టాండ్ టిక్కెట్టును రూ.1000కి పెంచే ఛాన్స్ ఉంది. అదే సమయంలో రూ. 1500ల టిక్కెట్ ధర రూ. 2000 నుంచి రూ. 2500ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది.

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నియమించింది. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తొలి టెస్టు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరగనుంది. భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌తో పోటీపడనుంది.

అదే సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీని విడిచిపెట్టిన తర్వాత, జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్‌ స్టేడియంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు మొదటి మ్యాచ్ ఆడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో 8 ఏళ్ల తర్వాత జరగనున్న క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కాకముందే చాలా రకాలుగా ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈరోజు భారత జట్టు జైపూర్‌కు రానుంది. సాయంత్రంలోగా టీమిండియా ఆటగాళ్లు జైపూర్ చేరుకోనున్నారు. హోటల్‌లో 3 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. దీని తర్వాత నవంబర్ 14 నుంచి 16 వరకు సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తారు. అదే సమయంలో, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కూడా టీ20 ప్రపంచ కప్ తర్వాత నేరుగా జైపూర్ చేరుకుంటుంది. క్వారంటైన్ పీరియడ్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, న్యూజిలాండ్ టెస్ట్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మంగళవారం నాడే జైపూర్ చేరుకున్నారు.

Also Read: Syed Mushtaq Ali Trophy: 4 మెయిడిన్లు.. 2 వికెట్లు.. టీ20లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక భారత బౌలర్..!

Cricket Australia: బ్యాట్స్‌మెన్‌ను బంతితో కొట్టిన ఆస్ట్రేలియా బౌలర్.. జరిమానాతో పాటు సస్పెన్షన్ కూడా.. అసలేమైందంటే?