IND vs NZ, Mumbai Test: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మహారాష్ట్ర.. రెండో టెస్ట్‌కు ముందు కీలక నిర్ణయం..!

|

Nov 28, 2021 | 9:01 AM

Wankhede Stadium: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన టీ20, తొలి టెస్ట్‌ మ్యాచ్‌లకు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించారు. అయితే రెండో టెస్టులో మాత్రం..

IND vs NZ, Mumbai Test: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మహారాష్ట్ర.. రెండో టెస్ట్‌కు ముందు కీలక నిర్ణయం..!
Ind Vs Nz 2nd Test
Follow us on

India Vs New Zealand, Mumbai Test: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌తో దేశంలో 8 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ తిరిగి వచ్చింది. నవంబర్ 17 నుంచి జరగనున్న టీ20 సిరీస్‌తో భారత మైదానాల్లో టీమ్ ఇండియాతో పాటు ప్రపంచ క్రికెట్‌లోని ఇతర స్టార్ల పోటీ మళ్లీ మొదలైంది. ఈ సిరీస్‌తో ప్రేక్షకులు కూడా స్టేడియాలకు చేరుకుంటున్నారు. జైపూర్, రాంచీ, కోల్‌కతాలో జరిగిన టీ20 మ్యాచ్‌లలో ప్రేక్షకులు పూర్తి సామర్థ్యంతో స్టేడియంలో కనిపించారు. కాన్పూర్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అదే ట్రెండ్ కొనసాగుతోంది. కానీ, ముంబైలో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అలా జరగదు. వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు రోజుకు 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. ఇది అభిమానులతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)ని నిరాశపరిచింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ డిసెంబర్ 3 నుంచి చారిత్రక వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టు క్రికెట్‌ మళ్లీ ముంబైకి చేరుకుంది. 2011లో భారత్‌ ప్రపంచకప్‌ విజయం సాధించిన ఈ మైదానంలో చివరి టెస్టు మ్యాచ్‌ 2016లో ఆడింది. ఇందులో భారత జట్టు ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. అప్పటి నుంచి ఇక్కడ టెస్టు మ్యాచ్‌ జరగలేదు. ప్రస్తుతం ఈ నిరీక్షణకు తెరపడి భారత జట్టు మళ్లీ ఈ మైదానంలోకి రానుండడంతో ప్రేక్షకుల పునరాగమనం విషయంలో మాత్రం కొంత నిరాశే ఎదురైంది.

50 శాతం కోసం ఎంసీఏ ప్రయత్నాలు..
కరోనా ఎక్కువగా ప్రభావితమైన నగరాల్లో ఒకటైన ముంబైలో జరగనున్న ఈ మ్యాచ్‌లో కోవిడ్ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఈ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకుల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది. పూర్తి సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించకపోవడానకి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. ప్రేక్షకుల సామర్థ్యాన్ని 50 శాతం పెంచుకునేందుకు ఎంసీఏ అనుమతి పొందాలని భావిస్తోంది. “మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకం చేసిన సాధారణ ఉత్తర్వు ప్రకారం, ఇప్పటివరకు 25 శాతం మంది ప్రేక్షకులను వాంఖడే టెస్ట్‌కు అనుమతించారు. వారు 50 శాతం ప్రేక్షకులను కూడా అనుమతించగలరని ఎంసీఏ భావిస్తోందని” ఓ అధికారి పేర్కొన్నారు.

వాంఖడేలో తిరిగొచ్చిన కోహ్లీ..
భారత్ ఎన్నో చారిత్రాత్మక విజయాలకు సాక్షిగా నిలిచిన వాంఖడే స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకులు కూర్చునే సదుపాయం ఉంది. COVID-19 మహమ్మారి కారణంగా గత సంవత్సరం క్రీడా కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్ ముంబై‌కు తిరిగి రావడంతో ప్రేక్షకులు ఆనందిస్తున్నారు. దీంతో పాటు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ నుంచి మైదానంలోకి రానున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2021లో జట్టు ఓటమి తర్వాత కోహ్లీ కొంత విరామం తీసుకున్నాడు. దీని కారణంగా టీ20 సిరీస్, న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టుకు అందుబాటులో లేని సంగతి తెలిసిందే.

Also Read: IND vs NZ: కాన్పూర్‌లో అక్షర్ విధ్వంసం.. 7 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు.. దిగ్గజాల సరసన చేరిన యంగ్ బౌలర్

India Vs South Africa 2021: దక్షిణాఫ్రికా పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్.. బీసీసీఐతో ఏం చెప్పిందంటే?