
Kuldeep Yadav Magic Delivery: టోర్నమెంట్ నాకౌట్ దశల్లో వికెట్లు తీయకపోవడంతో విమర్శలు ఎదుర్కొన టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కుల్దీప్ యాదవ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ ఎడమచేతి వాటం మణికట్టు స్పిన్నర్ తన పాత శైలిలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రెచ్చిపోయాడు. టీమిండియాకు అతిపెద్ద వికెట్లలో ఒకదాన్ని అందించాడు.
కాగా, దుబాయ్ వేదికగా జరగుతోన్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు విల్ యంగ్, రచిన్ రవీంద్ర ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి వికెట్‌కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో వీరు మంచి ఆరంభం ఇచ్చారు.
CASTLED! | \ | #KuldeepYadav makes the impact straightaway, as #RachinRavindra is cleaned up courtesy a sharp googly! 💪🏻#ChampionsTrophyOnJioStar FINAL 👉 #INDvNZ | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!
📺📱 Start Watching FREE on… pic.twitter.com/VEl1RJOxfE
— Star Sports (@StarSportsIndia) March 9, 2025
అయితే, ఇన్నింగ్స్ 11వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ కివీస్ ఓపెనర్ రచిన్ రవీంద్రను ఆశ్చర్యపరిచాడు. ఆ ఓవర్ మొదటి డెలివరీలో, కుల్దీప్ ఒక మంచి లెంగ్త్ బంతిని బౌల్ చేశాడు. అది గూగ్లీగా ఉంది. రవీంద్ర ఆ డెలివరీని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. బ్యాట్‌కు రచిన్‌కు మధ్య ఉన్న గ్యాప్ గుండా వెళ్లి ఆఫ్ స్టంప్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కుల్దీప్ ఆనందంతో గెంతులేశాడు. టీమిండియాకు 2వ వికెట్‌ను అందించాడు. రవీంద్ర గొప్ప ఫామ్‌లో ఉన్నందున భారత జట్టుకు పెద్ద ముప్పుగా మారేవాడు. కివీస్ బ్యాటర్ గత మూడు మ్యాచ్‌లలో రెండు సెంచరీలు చేశాడు. అతను ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి ఉంటే రోహిత్ శర్మ సేనకు ఆటను దూరం చేసేవాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 21 ఓవర్లు ముగిసేసరికి కివీస్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. డారిల్ మిచెల్, టామ్ లాథమ్ క్రీజులో ఉన్నారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో, కుల్దీప్ యాదవ్ కేన్ విలియమ్సన్ (11 పరుగులు), రచిన్ రవీంద్ర (37 పరుగులు)లను పెవిలియన్‌కు పంపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..