
IND vs NZ 1st ODI, Team India Playing XI: భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. అక్లాండ్‌లోని చారిత్రాత్మక ఈడెన్ పార్క్ ఈ తొలి వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇటీవల ముగిసిన టి20 సిరీస్ కంటే కూడా ఈ వన్డే సిరీస్‌పై క్రికెట్ అభిమానుల ఆసక్తి ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం. ఈ సీనియర్ల జోడిపై అంచనాలు ఎప్పుడూ భారీగానే ఉంటాయి. అయితే, వారి ముందున్న ప్రధాన లక్ష్యం 2027లో సౌత్ ఆఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడటం. అందుకు అనుగుణంగా న్యూజిలాండ్‌తో ఈ సిరీస్‌లో వారు అత్యుత్తమంగా రాణించాల్సిన అవసరం ఉంది.
ప్రపంచ కప్ జట్టులో కొన్ని స్థానాలు ఇప్పటికే దాదాపు ఖరారైనట్లు కనిపిస్తున్నాయి. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ప్రపంచ కప్ నాటికి మిగతా కీలక ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభమన్ గిల్‌పై ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే ఈ ఐదు వన్డేల సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకంగా మారింది. ఈ సిరీస్‌ను గెలుచుకుంటే, అది సౌత్ ఆఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌కు మంచి అనుభవం, అడ్వాంటేజ్ అవుతుంది.
బుధవారం జరగబోయే తొలి వన్డేలో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. కెప్టెన్‌గా శుభమన్ గిల్, వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో ఉండటం ఖాయం. ప్రస్తుతం ఈ ఇద్దరు మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల “రోకో జోడి” 100% తుది జట్టులో ఉంటుంది. టీమిండియా అభిమానులు కూడా వీరి ఆటను చూడటానికే ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కూడా తుది జట్టులో ఉండడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.
కీపర్ల విషయానికి వస్తే, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఫైనల్‌గా కేఎల్ రాహుల్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ కోటాలో అక్షర్ పటేల్‌కు తుది జట్టులో స్థానం ఖాయం. అయితే నితీష్ కుమార్ రెడ్డి, ఇతర ఆటగాళ్లు బెంచ్‌కే పరిమితం కానున్నారు. మెయిన్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటాడు. అలాగే, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ స్థానాలు పక్కా. మూడో ఫాస్ట్ బౌలర్‌గా అన్షుల్ కాంబోజ్ లేదా గుర్నూర్ బార్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.
ఎక్కువమంది చదివినది: W,W,W,W,W,W,W,W,W.. ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో చెలరేగిన టీమిండియా ప్లేయర్..!
ఇకపోతే, తొలి వన్డే జరిగే అక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ టీమిండియాకు ఒక అగ్ని పరీక్ష వంటిది. ఇక్కడ ఆడిన 11 వన్డేల్లో టీమిండియా గెలిచింది కేవలం నాలుగు మ్యాచ్‌లే. ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయి, ఒక మ్యాచ్ టై అయింది. టీమిండియా గెలిచిన ఆ నాలుగు మ్యాచ్‌లలో ఒకటి జింబాబ్వేతో ప్రపంచకప్‌లో ఆడింది. అంటే, న్యూజిలాండ్‌పై ఈ మైదానంలో టీమిండియా కేవలం మూడు మ్యాచ్‌లే గెలిచి, ఆరు మ్యాచ్‌లలో ఓడింది. మొత్తంగా, ఈ గ్రౌండ్ షేప్ టీమిండియాకు ఫీల్డింగ్ సెట్ చేసుకోవడం చాలా కష్టతరం చేస్తుంది. న్యూజిలాండ్ ఈ పిచ్‌పై రెగ్యులర్‌గా ఆడుతుంది కాబట్టి, వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇటీవల శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టి20 జట్టు నాలుగో టి20లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో మరోసారి తొలి వన్డే ఇక్కడే ఆడుతున్న నేపథ్యంలో గిల్ సేనకు ఇది ఒక పెద్ద సవాల్‌గా నిలవనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..