AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashasvi Jaiswal: సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. బ్యాటింగ్‌తో ఆ విమర్శలకు చెక్..

ఇంగ్లాండ్ పర్యటనలో నిలకడగా రాణించడంలో ఇబ్బంది పడుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఓవల్‌లో జరుగుతున్న టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులకే ఔటైన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాటింగ్‌తో విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.

Yashasvi Jaiswal: సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. బ్యాటింగ్‌తో ఆ విమర్శలకు చెక్..
Yashasvi Jaiswal Century
Krishna S
|

Updated on: Aug 02, 2025 | 9:31 PM

Share

ఇండియా – ఇంగ్లాండ్ చివరి టెస్ట్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ తక్కువ 247 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. గిల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ తక్కువ పరుగులకే ఔట్ అయినా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం అదరగొట్టాడు. నిలకడగా ఆడి సెంచరీతో మెరిశాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 2రన్స్‌కే అవుట్ అయిన సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. ఇవాళ్టి బ్యాటింగ్‌తో విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. నిజానికి జైస్వాల్ లీడ్స్ టెస్ట్‌లో 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత మళ్లీ సెంచరీ చేయలేడు. ఇప్పుడు, జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో 127 బంతుల్లో ఆరో సెంచరీ పూర్తి చేసుకుని విమర్శకుల ప్రశంసలు పొందాడు.

ఇంగ్లాండ్‌పై 4 సెంచరీలు

ఓవల్ గ్రౌండ్‌లో తన టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించిన జైస్వాల్, ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై ఒక సెంచరీ చేశాడు. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేసిన జైస్వాల్, ఎడ్జ్‌బాస్టన్, మాంచెస్టర్‌లలో అర్ధ సెంచరీలు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 87 రన్స్ సాధించగా.. మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేశాడు. దీనితో పాటు జైస్వాల్ రెండుసార్లు డకౌట్ అయ్యాడు.

సచిన్, కోహ్లీల రికార్డ్ బ్రేక్

జైస్వాల్ 2వేల రన్స్ చేసి సచిన్, కోహ్లీ రికార్డులను బ్రేక్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లోనే 2వేల పరుగులు పూర్తి చేశాడు. 40 టెస్ట్ ఇన్నింగ్స్‌లో పూర్తి చేసి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. దీంతో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో రెండు వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. జైస్వాల్‌కు ముందు రాహుల్ ద్రవిడ్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్‌లో రెండు వేల పరుగులు పూర్తి చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్