
Team India: ఇంగ్లాండ్ పర్యటనలో టీం ఇండియా (England vs India) ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. లీడ్స్ తర్వాత, లార్డ్స్‌లో కూడా భారత బౌలర్లు వికెట్ల కోసం ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. దీంతో భారత జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు సిరీస్‌లో 2-1తో వెనుకబడి ఉంది. జులై 23 నుంచి మాంచెస్టర్‌లో జరిగే నాల్గవ మ్యాచ్ రెండు జట్లకు నిర్ణయాత్మకం కానుంది.
బెన్ స్టోక్స్, అతని బృందం మరోసారి భారత జట్టును చిత్తు చేయగలిగితే, 3-1 ఆధిక్యంలోకి వెళతారు. దీంతో భారత జట్టు సిరీస్‌ను కోల్పోతుంది. ఇటువంటి పరిస్థితిలో, రెండు జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరాటం కనిపిస్తుంది. కానీ, దీనికి ముందు, ఇది ఓ టీమిండియా ప్లేయర్ కెరీర్‌లో చివరి మ్యాచ్ కావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఇప్పుడు నిర్ణయాత్మక మలుపు వైపు కదులుతోంది. ఈ సిరీస్‌లోని ఐదవ, చివరి టెస్ట్ జులై 30 నుంచి ఓవల్ మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ కెరీర్ భవిష్యత్తు కూడా నిర్ణయించబడుతుంది.
ఇప్పటి వరకు మనం మాట్లాడుతన్న ప్లేయర్ పేరు ప్రసిద్ కృష్ణ. ఇంగ్లాండ్ పర్యటనలో అతని ప్రదర్శన ఇప్పటివరకు చాలా నిరాశపరిచింది. అతను ప్రారంభ టెస్ట్‌లో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించబడ్డాడు. ఈ సమయంలో, అతను జట్టుకు చాలా ఖరీదైనవాడని నిరూపితమయ్యాడు. దాని కారణంగా అతను విమర్శలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.
ఇంగ్లాండ్‌లోని క్లిష్ట పరిస్థితుల్లో ప్రదర్శన ఇవ్వడానికి ప్రసిద్ధ్ కృష్ణను భారత టెస్ట్ జట్టులో చేర్చారు. కానీ, అతని ప్రదర్శన అంచనాలకు చాలా తక్కువగా ఉంది. అతను తన వేగం, బౌన్స్‌తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, ఖచ్చితమైన లైన్-లెంగ్త్, వికెట్ తీసుకునే సామర్థ్యంలో అతను నిరంతరం వెనుకబడి ఉన్నాడు.
ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ అతనిపై చాలా పరుగులు సాధించారు. ఇది జట్టుపై అదనపు ఒత్తిడిని తెచ్చింది. అతను రెండు మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్‌లలో 5.33 ఎకానమీతో ఆరు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ పేలవమైన ప్రదర్శన కారణంగా, లార్డ్స్‌లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో అతన్ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించారు. కానీ, ఇప్పుడు బౌలర్ల గాయం కారణంగా అతను తిరిగి రావచ్చు.
మాంచెస్టర్ టెస్ట్‌కి ముందు, చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా మరోసారి ప్రసిద్ధ్ కృష్ణకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభిస్తుంది. ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్ లేనప్పుడు, జట్టు యాజమాన్యం అతన్ని ఎంపిక చేయవచ్చు. ఈ మ్యాచ్ అతను తనను తాను నిరూపించుకోవడానికి చివరి అవకాశం కూడా కావొచ్చు.
ఈ టెస్టులోనూ అతను తిరిగి ఫామ్ సాధించలేకపోతే, భవిష్యత్తులో అతనికి టెస్ట్ జట్టు తలుపులు శాశ్వతంగా మూసుకుపోవచ్చు. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అతనికి జట్టు నుంచి శాశ్వతంగా నిష్క్రమించే మార్గాన్ని చూపించవచ్చు. జట్టుకు ఉత్తమ ప్రదర్శన ఇవ్వగల ఆటగాళ్లకే అవకాశం ఇస్తానని అతను ఇప్పటికే స్పష్టం చేశాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు ప్రసిద్ధ్ కృష్ణ రెండు టెస్టుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. కానీ 5.33 ఖరీదైన ఎకానమీతో జట్టును నిరాశపరిచాడు.
లార్డ్స్ టెస్ట్ నుంచి పేలవమైన ఫామ్, ఖరీదైన స్పెల్ కారణంగా ప్లేయింగ్ 11 నుంచి తొలగించబడ్డాడు.
డూ ఆర్ డై మ్యాచ్: మాంచెస్టర్ టెస్ట్‌లో ప్రసిద్ధ్ కృష్ణ తన ప్రదర్శనను మెరుగుపరచుకోలేకపోతే, అతను టెస్ట్ జట్టులోకి తిరిగి రావడం అసాధ్యం అవుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..