IND vs ENG: ఆఖరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ చిత్తు.. సిరీస్‌ క్లీన్ స్విప్.. ఇక టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు బిగ్ బూస్ట్. ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం (ఫిబ్రవరి 12) జరిగిన ఆఖరి వన్డేలో పర్యాటక జట్టును 142 పరుగుల తేడాతో చిత్తు చేసింది రోహిత్ సేన.

IND vs ENG: ఆఖరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ చిత్తు.. సిరీస్‌ క్లీన్ స్విప్.. ఇక టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ
Team India

Updated on: Feb 12, 2025 | 9:27 PM

ఇంగ్లండ్ తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ భారత్ ఇంగ్లాండ్‌ను 3-0 తో సొంతం చేసుకుంది. బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కానీ ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ నిలకడగా ఆడారు.  శుభ్‌మాన్ గిల్ వన్డే క్రికెట్‌లో తన ఏడో సెంచరీని సాధించాడు.  తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తాను మంచి ఫామ్‌లో ఉన్నానని నిరూపించాడు. ఇక గత మ్యాచ్‌లో విఫలమైన విరాట్ కోహ్లీ కూడా అర్ధ సెంచరీ  సాధించాడు.  శ్రేయాస్ అయ్యర్ కూడా మిడిలార్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో  నిర్ణీత 50 ఓవర్లలో  356 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ  టార్గెట్ ను ఇంగ్లాండ్ అందుకోలేకపోయింది.

శుభారంభం లభించినా..

ఇవి కూడా చదవండి

భారత్ నిర్దేశించిన 357 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు దూకుడుగానే ఆడారు. ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్ తొలి వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత టామ్ బ్రాడెన్ కూడా ధాటిగా ఆడాడు. అయితే రెండు వికెట్లు పడిన తర్వాత ఇంగ్లండ్ పతనం మొదలైంది. మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. జో రూట్, జోస్ బట్లర్ లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 142 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అర్ష్ దీప్ సింగ్ , హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీశారు

 

భారత్ గెలుపు సంబరాలు..

3-0తో సిరీస్ కైవసం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..