
Ravindra Jadeja India vs England: 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. భారత్ ఓటమి తర్వాత మరో చేదు వార్త వచ్చింది. నివేదికల ప్రకారం, మ్యాచ్ సమయంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సమస్యలను ఎదుర్కొన్నాడు. అతని కండరాలు ఒత్తిడికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జడేజా తదుపరి మ్యాచ్‌కి ముందు ఫిట్‌గా లేకపోతే జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది.
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో జడేజా బ్యాటింగ్ చేసే సమయంలో పరుగులు తీసేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇది జరిగిన వెంటనే అతను సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కనిపించాడు. పిటిఐ వార్తల ప్రకారం, జడేజా కండరాల ఒత్తిడితో బాధపడుతున్నాడు. అయితే, ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీనిపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. విలేఖరుల సమావేశంలో ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘ఫిజియోతో మాట్లాడే అవకాశం నాకు ఇంకా రాలేదు. నేను తిరిగి వెళ్లి అతనితో మాట్లాడి ఏమి జరిగిందో చూస్తానంటూ చెప్పుకొచ్చాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 180 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేశాడు. ఈ సమయంలో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అతను 2 పరుగులు చేసిన తర్వాత రనౌట్ అయ్యాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 3 వికెట్లు తీశాడు. 18 ఓవర్లలో 88 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు. 34 ఓవర్లలో 131 పరుగులు ఇచ్చాడు.
హైదరాబాద్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..