ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆటలో ఒక ఆసక్తకర సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటంటే.. ఇంగ్లండ్ యంగ్ ప్లేయర్, స్పిన్నర్ షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డ్ అయినా కూడా రివ్యూ కావాలని అంపైర్ కు సైగలు చేశాడు. దీనిని చూసి బషీర్ కు తోడుగా క్రీజులో ఉన్న జో రూట్ తో పాటు అందరూ నవ్వుకున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 46 ఓవర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రవీంద్ర జడేజా వేసిన బంతిని అడ్డుకోలేక షోయబ్ బషీర్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఇది బషీర్ గమనించలేదేమో. టీమిండియా క్రికెటర్ల సంబరాలు చూసిన అతను బౌడ్ల్ కాకుండా వికెట్ కీపర్‌కు దొరికిపోయానని భావించి రివ్యూ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే రివ్యూ కావాలని అంపైర్ కు సిగ్నల్ కూడా ఇచ్చాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే నాన్ స్ట్రైక్‌లో ఉన్న జోరూట్ ఒక్కసారిగా నవ్వుతూ బౌల్డయ్యావని బషీర్‌తో చెప్పాడు. దీంతో నిరాశగా మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు బషీర్.
ఇది చూసిన భారత ఆటగాళ్లు కొద్ది సేపు నవ్వుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ‘బషీరో బ్రో.. క్లీన్ బౌల్డ్ లకు రివ్యూలు ఉండవు’ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ జట్టు రెండో స్థానానికి పడిపోయింది. ఈ విజయంలో WTC ఫైనల్ అవకాశాలను మరింత సుగమం చేసుకుంది రోహిత్ సేన.
ICYMI: Shoaib Bashir was spotted requesting a DRS review despite being bowled on that delivery in Dharamsala. Later, he discovered his mistake.
Joe Root’s reaction tells the whole story! 😅
📸: Jio Cinema pic.twitter.com/OnUom0HrNH
— CricTracker (@Cricketracker) March 9, 2024
మరిన్ని క్రీడా వార్తలు, కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..