Rohit Sharma: కటక్ వన్డేలో రోహిత్ సెంచరీ.. 16 నెలల తర్వాత తుఫాన్ ఇన్నింగ్స్

Rohit Sharma Smashes Century: 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత జట్టు నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. రోహిత్ 76 బంతుల్లో సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ 5 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను ఆదిల్ రషీద్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శుభ్‌మాన్ గిల్ 60 పరుగులు చేసి జామీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్ తో కలిసి 136 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Rohit Sharma: కటక్ వన్డేలో రోహిత్ సెంచరీ.. 16 నెలల తర్వాత తుఫాన్ ఇన్నింగ్స్
Rohit Sharma Half Century

Updated on: Feb 09, 2025 | 8:40 PM

Rohit Sharma Smashes Century: 26వ ఓవర్లో ఆదిల్ రషీద్ పై రోహిత్ శర్మ సిక్స్ కొట్టాడు. దీంతో హిట్‌మ్యాన్ 76 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది అతని వన్డే కెరీర్‌లో 32వ సెంచరీగా నిలిచింది. అతను కేవలం 30 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. 16 నెలల తర్వాత రోహిత్ వన్డేలో సెంచరీ సాధించాడు. అతను తన చివరి సెంచరీని 2023 అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌పై సాధించాడు.

2023 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌పై 84 బంతుల్లో 131 పరుగులు చేసిన తర్వాత రోహిత్ చేసిన తొలి వన్డే సెంచరీ ఇదే కావడం గమనార్హం. ఇది రోహిత్ కు 32వ వన్డే సెంచరీ కాగా, ఇది ఆల్ టైమ్ జాబితాలో మూడో స్థానంలో ఉంచేలా చేసింది. తొలి రెండు స్థానాల్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్ ప్రారంభంలోనే రోహిత్ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్‌కు ముందు అతను క్రిస్ గేల్‌తో 331 సిక్సర్లతో సమం చేశాడు. భారత జట్టు ఛేజింగ్‌లో రెండవ ఓవర్‌లో గస్ అట్కిన్సన్‌ను మిడ్‌వికెట్‌పై సిక్స్‌ బాదడం ద్వారా వెస్టిండీస్ ఓపెనర్‌ను రోహిత్ శర్మ అధిగమించాడు.

టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్,  సాకిబ్ మహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..