IND vs ENG : టీమిండియాపై నోరు పారేసుకుంటోన్న ఇంగ్లండ్‌ క్రికెటర్లు.. సిరీస్ ప్రారంభానికి ముందే మాటల దాడి

జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు రానుంది. ఈ మ్యాచ్ స్వదేశంలో జరగడం టీమ్ ఇండియాకు ప్లస్ పాయింట్. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ జట్టు అప్పుడే మాటల దాడి మొదలు పెట్టింది.

IND vs ENG : టీమిండియాపై నోరు పారేసుకుంటోన్న ఇంగ్లండ్‌ క్రికెటర్లు.. సిరీస్ ప్రారంభానికి ముందే మాటల దాడి
England, Cricket Team

Updated on: Jan 16, 2024 | 9:46 AM

జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు రానుంది. ఈ మ్యాచ్ స్వదేశంలో జరగడం టీమ్ ఇండియాకు ప్లస్ పాయింట్. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ జట్టు అప్పుడే మాటల దాడి మొదలు పెట్టింది. ఈసారి భారత్‌లో సిరీస్‌ జరుగుతోంది. ఎప్పటిలాగే స్పిన్ బౌలర్లకు ఉపయోగపడే పిచ్‌లను రూపొందించబోతున్నారని తెలుస్తోది. తొలిరోజు నుంచి బంతి తిరిగినప్పటికీ తామే భారత్‌పై ఫిర్యాదు చేయబోమని ఇంగ్లండ్‌ వైస్‌ కెప్టెన్‌ ఒలీ పోప్‌ తెలిపాడు. ఇంగ్లండ్‌లో సీమర్లకు సహాయపడే పిచ్‌లు ఉన్నాయి. భారత్ ఇప్పుడు తమ స్పిన్నర్లకు సహాయపడే ట్రాక్‌లతో ముందుకు సాగడంలో ఆశ్చర్యం లేదు. దీనిపై మేము ఫిర్యాదు చేయబోమని పోప్ చెప్పాడు.

‘స్పిన్నింగ్ పిచ్‌ల కారణంగా భారత్‌లో పరుగులు తక్కువగా రావచ్చు. దీనికి కూడా మాకు అభ్యంతరం లేదు. అలాంటి ట్రాక్‌పై పరుగులు తీయడానికి మేము ఒక మార్గాన్ని కనుగొంటాము’ అని ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ చెప్పాడు.
సాధారణంగా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత్ పిచ్ లపై ఫిర్యాదు చేయబోమని ఓలీ పోప్ కొత్త వైఖరిని అవలంబించాడా అనే ప్రశ్నలు రావడం సహజమే. కాబట్టి ఈసారి కూడా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీని మనం ఆశించవచ్చు.

ఇవి కూడా చదవండి

భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఎప్పుడు ప్రారంభం కానుందంటే?

జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరగనుండగా, రెండో మ్యాచ్‌ విశాఖపట్నంలోని వైఎస్‌ఆర్‌ స్టేడియంలో జరగనుంది. మూడో మ్యాచ్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. నాల్గవ టెస్ట్ మ్యాచ్ రాంచీలోని JSCA స్టేడియంలో జరగనుండగా, ధర్మశాలలోని HPCA స్టేడియం చివరి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

  • జనవరి 25 నుండి 29 వరకు – మొదటి టెస్ట్ (హైదరాబాద్)
  • ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు – రెండో టెస్టు (విశాఖపట్నం)
  • ఫిబ్రవరి 15 నుండి 19 వరకు – మూడో టెస్టు (రాజ్‌కోట్)
  • ఫిబ్రవరి 23 నుండి 27 వరకు – నాల్గవ టెస్ట్ (రాంచీ)
  • మార్చి 7 నుండి 11 వరకు – ఐదవ టెస్ట్ (ధర్మశాల)

తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..