Mohammad Siraj: నిప్పులు చెరిగి, ఇంగ్లండ్‌ నడ్డి విరిచి.. రాజ్‌కోట్‌లో మరో ఘనత అందుకున్న సిరాజ్ మియా

|

Feb 17, 2024 | 4:43 PM

ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్ సిరాజ్ చెలరేగాడు. నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచాడు. మూడో రోజు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన మహ్మద్ సిరాజ్ 21.1 ఓవర్లలో 84 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తద్వారా ఇంగ్లండ్‌ జట్టు 319 పరుగులకు ఆలౌట్‌ కావడంలో కీలక పాత్ర పోషించాడు

Mohammad Siraj: నిప్పులు చెరిగి, ఇంగ్లండ్‌ నడ్డి విరిచి.. రాజ్‌కోట్‌లో మరో ఘనత అందుకున్న సిరాజ్ మియా
Mohammad Siraj
Follow us on

ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్ సిరాజ్ చెలరేగాడు. నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచాడు. మూడో రోజు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన మహ్మద్ సిరాజ్ 21.1 ఓవర్లలో 84 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తద్వారా ఇంగ్లండ్‌ జట్టు 319 పరుగులకు ఆలౌట్‌ కావడంలో కీలక పాత్ర పోషించాడు. విశేషమేమిటంటే ఈ నాలుగు వికెట్లతో మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత సాధించిన 33వ భారత బౌలర్‌గా నిలిచాడు. కేవలం 76 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మియా వన్డే క్రికెట్‌లో 68 వికెట్లు, టీ20లో 12 వికెట్లు, టెస్టు క్రికెట్‌లో 78 వికెట్లు పడగొట్టాడు. దీంతో మొత్తం 152 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 319 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.

భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత జట్టు ధాటిగా ఆడుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ త్వరగా అవుటైనా మరో ఓపెనింగ్ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం  122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్ భారత భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఇందులో తొమ్మిది ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లు ఉన్నాయి.  మరోవైపు వన్‌ డౌన్‌ బ్యాటర్‌ శుభ్‌ మన్‌ గిల్‌ కూడా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతానికి ఈ మ్యాచ్‌లో భారత జట్టుదే పైచేయి. నాలుగో రోజు ఆటలో 2వ సెషన్ వరకు భారత జట్టు బ్యాటింగ్ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 445 పరుగులకు ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి

సిరాజ్ సూపర్ యార్కర్.. బ్యాటర్ ఫ్యూజులౌట్..

 

నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్..

భారత్ భారీ ఆధిక్యం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి