INDIA VS ENGLAND: మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అసలే ఇంగ్లండ్ చేతిలో ఓటమితో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన టీమిండియాకు ఐసీసీ మరో షాక్ ఇచ్చింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించింది. దీంతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) నుంచి 2 పాయింట్లను కోతవేసింది. ఇది కచ్చితంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసేలా ఉంది. కాగా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో నిర్ణీత సమయానికి భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఐసీసీకి నివేదించాడు. దీంతో ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.22 ప్రకారం మ్యాచ్ ఫీజులో కోత విధించింది. కాగా టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండా జరిమానాతో మాత్రమే సరిపెట్టారు.
WTC ఫైనల్ అవకాశాలపై దెబ్బ!
కాగా ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ నుంచి రెండు పాయింట్ల కోత విధించడంతో టీమిండియా ఖాతాలో ప్రస్తుతం 75 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జాబితాలో భారత జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఇదే సమయంలో పాకిస్తాన్ జట్టు టీమిండియాను అధిగమించి మూడోస్థానానికి చేరుకుంది. కాగా డబ్ల్యూటీసీ (2021-23) రెండో సీజన్ లో భారత్ ఇప్పటివరకు 6 విజయాలు, 4 ఓటములు, 2 డ్రాలతో భారత్ ..52.08 పాయింట్ల శాతాన్ని సాధించింది. ఈ సీజన్‌లో భారత్ ఇంకా 2 టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంది. సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య స్వదేశంలో ఆస్ట్రేలియాతో 4 టెస్టు మ్యాచ్‌లతో పాటు నవంబర్లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.
India suffer a double blow in the #WTC23 standings.
Read more ? https://t.co/KtGuIUqQHK pic.twitter.com/s7sx9Xj4HC
— ICC (@ICC) July 6, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..