
IND vs ENG 3rd Test: లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు ఈ తప్పు కారణంగా ఓటమి ఎదురైతే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. లార్డ్స్ టెస్ట్‌లో, భారత జట్టు ఇప్పటివరకు తన మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు.. రిషబ్ పంత్ 19 పరుగులతో అండగా నిలిచాడు. కాగా, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది.
ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ స్కోరు 271/7గా ఉంది. కానీ టెయిల్-ఎండర్లు టీం ఇండియా ప్రయత్నాలను దెబ్బతీశారు. ఫీల్డింగ్ సమయంలో భారత ఆటగాళ్ల తప్పిదాల కారణంగా, ఇంగ్లాండ్ స్కోరు 271/7 నుంచి 387/10కి చేరుకుంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 87వ ఓవర్లో స్లిప్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జామీ స్మిత్ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ వదిలివేసినప్పుడు అతిపెద్ద మలుపు తిరిగింది. ఆ సమయంలో జేమీ స్మిత్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
తర్వాత కూడా జేమీ స్మిత్ టీం ఇండియాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. జేమీ స్మిత్, బ్రైడాన్ కార్స్ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జేమీ స్మిత్ 51 పరుగులు, బ్రైడాన్ కార్స్ 56 పరుగులు చేశారు. భారత జట్టు బౌలర్లు ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగుల కంటే తక్కువ పరుగులకే పరిమితం చేయగలిగేవారు. కానీ, ఫీల్డింగ్ పేలవంగా ఉండటంతో మరోసారి ఇన్నింగ్స్ చెడిపోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. చివరికి, ఈ పరుగులు టీం ఇండియాను చాలా దెబ్బతీస్తాయి. ఈ తప్పు కారణంగా భారత జట్టు ఓటమిని ఎదుర్కోవలసి రావచ్చు.
లార్డ్స్ టెస్ట్ మూడో రోజున టీం ఇండియా బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయడం కష్టంగా మారవచ్చు. టెస్ట్ మ్యాచ్ తొలి రోజున మొత్తం 4 వికెట్లు పడిపోయాయి. కానీ రెండో రోజు పిచ్‌లో చాలా మార్పు వచ్చి మొత్తం 9 వికెట్లు పడిపోయాయి. 2021 టెస్ట్ సిరీస్‌లో లార్డ్స్‌లో కేఎల్ రాహుల్ చివరిసారిగా అద్భుతమైన సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ స్కోరు (387 పరుగులు)కి భారత్ చేరువ కావాలంటే, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది. లార్డ్స్ టెస్ట్ మూడో రోజున బౌలర్లకు పిచ్ నుంచి మరింత సహాయం లభించే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..