IND vs ENG 2nd Test: ఆ పేరు వింటేనే వణికిపోతోన్న గిల్ సేన.. మరో భారీ ప్రమాదంలో భారత జట్టు..

Edgbaston, Birmingham: లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది. అయితే, రెండో టెస్ట్ కుముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ మైదానంలో మన జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా గెలిచిన దాఖలాలు లేవు.

IND vs ENG 2nd Test: ఆ పేరు వింటేనే వణికిపోతోన్న గిల్ సేన.. మరో భారీ ప్రమాదంలో భారత జట్టు..
Ind Vs Eng 2nd Test, Edgbaston, Birmingham

Updated on: Jun 25, 2025 | 4:59 PM

India Vs England 2nd Test: లీడ్స్‌లో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో.. టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో.. భారత ఆటగాళ్ల ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో.. అలాగే ఆఖరి స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడం. ఈ ఓటమి తర్వాత.. ఇప్పుడు టీమిండియాకు మరో ముప్పు పొంచి ఉంది. అదేంటంటే.. రెండో టెస్టు జరిగే వేదిక ఎడ్జ్‌బాస్టన్‌. ఈ స్టేడియం పేరు వింటేనే భారత జట్టు వణికిపోతోంది. ఎందుకో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతాం.

ఎడ్జ్‌బాస్టన్ టీమిండియాకు కొరకరాని కొయ్య..

ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మైదానంలో టీమిండియా 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 7 ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రా అయింది. టీమిండియా చివరిగా 2022 జులైలో ఇంగ్లాండ్‌తో ఈ వేదికలో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇలాంటి కలిసిరాని, చెత్త రికార్డు ఉన్న మైదానంలో గిల్ సేన గెలవాలంటే.. చెమటోడ్చాల్సిందే.

లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. టీం ఇండియా ఆటగాళ్లు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. కానీ బౌలింగ్, ఫీల్డింగ్‌లో తేలిపోయారు. బౌలర్లలో, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు నుంచి నలుగురు ఆటగాళ్ళు మొదటి మ్యాచ్‌లో మొత్తం ఐదు సెంచరీలు సాధించారు. రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించగా, శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, రాహుల్ బ్యాట్‌తో రాణించారు.

టెస్ట్ సిరీస్‌ను సమం చేయకుంటే, డబ్ల్యూటీసీ నుంచి ఔట్..

తొలి టెస్ట్ గెలుపుతో ఇంగ్లాండ్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో వారు మంచి ప్రదర్శన చేశారు. బెన్ డకెట్, స్టోక్స్, జో రూట్, ఓలీ పోప్ ఆటగాళ్లు ఫామ్‌ అందుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో వీరిని అడ్డుకోవడం అంత సులభమేం కాదు. అయితే.. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా లీడ్స్‌ టెస్టులో చేసిన తప్పులను సరిదిద్దుకుని బరిలోకి దిగుతుందని ఆశిద్దాం. అప్పుడే ఎడ్జ్‌బాస్టన్‌లో ఉన్న చెత్త రికార్డుకు బ్రేకులు వేయొచ్చు. అంతేకాదు 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసే సువర్ణావకాశం గిల్ సేన ముందు ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి