IND vs BAN: ‘భారత్‌ను ఓడిస్తాం.. పాక్ జట్టుకు పట్టిన గతే’: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ షాకింగ్ కామెంట్స్

|

Sep 17, 2024 | 8:19 PM

Bangladesh Fast bowler Big Statement Before Chennai Test: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం చెన్నై టెస్ట్ మ్యాచ్‌కు ముందు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సిరీస్‌లో భారత జట్టును ఓడించగలమన్న పూర్తి విశ్వాసం బంగ్లాదేశ్‌కు ఉందని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌పై విజయం తర్వాత జట్టులో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందని, అందుకే ఈసారి భారత్‌కు గట్టి సవాల్‌ విసురుతుందని షోరిఫుల్ ఇస్లాం పేర్కొన్నాడు.

IND vs BAN: భారత్‌ను ఓడిస్తాం.. పాక్ జట్టుకు పట్టిన గతే: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ షాకింగ్ కామెంట్స్
Bangladesh Vs India Test
Follow us on

Bangladesh Fast bowler Big Statement Before Chennai Test: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ షోరిఫుల్ ఇస్లాం చెన్నై టెస్ట్ మ్యాచ్‌కు ముందు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సిరీస్‌లో భారత జట్టును ఓడించగలమన్న పూర్తి విశ్వాసం బంగ్లాదేశ్‌కు ఉందని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌పై విజయం తర్వాత జట్టులో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందని, అందుకే ఈసారి భారత్‌కు గట్టి సవాల్‌ విసురుతుందని షోరిఫుల్ ఇస్లాం పేర్కొన్నాడు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నైలో జరగనుండగా, రెండో మ్యాచ్ కాన్పూర్‌లో జరగనుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా చెన్నైలో తన సన్నాహాల్లో బిజీగా ఉంది. ఈ సిరీస్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఈ సిరీస్‌ను భారత జట్టు గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో బాగా రాణిస్తామని ఆశిస్తున్నాం – షోరిఫుల్ ఇస్లాం..

ఈ సమయంలో బంగ్లాదేశ్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. దీనికి కారణం.. ఇటీవల సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను 2-0తో ఓడించి రావడం. ఈ కారణంగా బంగ్లాదేశ్ ఆటగాళ్ల మనోధైర్యం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో షోరీఫుల్ ఇస్లాం కూడా టీమ్ ఇండియాను ఓడిస్తానని నమ్మకంగా ఉన్నాడు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ మాట్లాడుతూ.. భారత్‌ను ఓడించగలమని నమ్ముతున్నాం. పాకిస్థాన్‌పై మేం మంచి ప్రదర్శన కనబరిచి భారత్‌లో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తామని ఆశిస్తున్నాం. మా ఫాస్ట్ బౌలర్లు ఫామ్‌లో ఉన్నారు. గొప్ప రిథమ్‌లో ఉన్నారు. ఇంతకుముందు మాకు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. కానీ, వారికి అంతగా మద్దతు లభించలేదు. ఇప్పుడు పూర్తి మద్దతు ఉంది. ఇది బంగ్లాదేశ్ క్రికెట్‌కు చాలా మంచి విషయం. బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్‌ను ఓడించిన విధానాన్ని చూస్తే, ఈసారి టీమ్ ఇండియాతో మ్యాచ్ కూడా చాలా కఠినంగా ఉండబోతోంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..