IND vs BAN: ఉప్పల్‌లో టీమిండియా రికార్డ్ విజయం.. బంగ్లాదేశ్‌పై సిరీస్ క్లీన్ స్వీప్

|

Oct 12, 2024 | 11:26 PM

టీ20 ప్రపంచ ఛాంపియన్ టీమ్ ఇండియా బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికేతొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా మూడో, చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. హైదరాబాద్ వేదికగా శనివారం (అక్టోబర్ 11) జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 133 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది.

IND vs BAN: ఉప్పల్‌లో టీమిండియా రికార్డ్ విజయం.. బంగ్లాదేశ్‌పై సిరీస్ క్లీన్ స్వీప్
Team India
Follow us on

టీ20 ప్రపంచ ఛాంపియన్ టీమ్ ఇండియా బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికేతొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా మూడో, చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. హైదరాబాద్ వేదికగా శనివారం (అక్టోబర్ 11) జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 133 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సంజూ శాంసన్ సాధించిన రికార్డు సెంచరీతో పాటు ఇతర బ్యాటర్ల తుఫాన్ ఇన్నింగ్స్ ల ఆధారంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు సాధించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీమ్ ఇండియా బౌలర్ల ముందు మోకరిల్లింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమ్ ఇండియా 133 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకు ముందు రెండు టెస్టుల సిరీస్ ను కూడా 2-0తో గెల్చుకుంది. దీంతో బంగ్లాదేశ్ ఇప్పుడు రిక్త హస్తాలతో ఇంటికి పయనమైంది.

ఉప్పల్ లో టీమిండియా విజయ దరహాసం..

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్.

బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్:

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, రిషద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్,  తన్జిమ్.

ఆఖరి టీ 20 మ్యాచ్ ఆడేసిన మహ్మదుల్లా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..