టీ20 ప్రపంచ కప్ 2022 లో భారత్ తన తదుపరి మ్యాచ్‌ను అడిలైడ్‌లో బంగ్లాదేశ్ టీంతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం పెర్త్ నుంచి టీమిండియా ఆటగాళ్లు కూడా వెళ్లారు. నవంబర్ 2న జరగనున్న ఈ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ జట్లకు చాలా కీలకం కానుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌లో టీమిండియా గెలవకపోతే మాత్రం.. భారీ నష్టం చవిచూడాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఇలా జరిగితే ఇరుజట్లకు కూడా ఆందోళనలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుంది.
నవంబర్ 2న అడిలైడ్‌లో మ్యాచ్. ఆ రోజు అక్కడి వాతావరణంలో మార్పులు ఉంటాయంట. వాతావరణ శాఖ ప్రకారం, ఆ రోజున ఈ ఆస్ట్రేలియా నగరంలో వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రారంభమైన సమయంలోనే వాతావరణంలో ఇలాంటి మార్పు రానుండడంతో.. మ్యాచ్ జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అలా అయితే, మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? మ్యాచ్ లేనప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? అనే విషయాలు తెలుసుకుందాం..
అడిలైడ్ వాతావరణంపై వస్తున్న వార్తల ప్రకారం ఆ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అయితే సాయంత్రం వర్షం కురుస్తుంది. నవంబర్ 2న, అడిలైడ్‌లో 60-70 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. అడిలైడ్‌లోని వాతావరణ ప్రభావం భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ వాష్ అవుట్ అయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. అలా కాకుండా మ్యాచ్ జరిగితేనే గెలిచిన జట్టుకు 2 పాయింట్లు వస్తాయి. అప్పుడు సమీకరణాలు మొత్తం మారిపోతాయి.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఓడిపోవడం భారత్‌కు మంచి సంకేతం కాదు. ఎందుకంటే ఇది సెమీ-ఫైనల్ సమీకరణాన్ని పాడు చేస్తుంది. టీమ్ ఇండియా దృష్టిలో ఒక మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సి ఉంది.
ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో రెండు జట్ల పరిస్థితిని ఇప్పుడు అర్థం చేసుకుందాం. రెండు జట్లు గ్రూప్ 2లో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కూడా భారత్‌తో సమానంగా 4 పాయింట్లను కలిగి ఉంది. భారత్ తర్వాత మూడవ స్థానంలో ఉంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య పాయింట్ల పట్టికలో తేడా ఒక్క రన్ రేట్ విషయంలోనే ఉంది. నవంబర్ 2న అడిలైడ్‌లో జరిగే మ్యాచ్‌కు ఇది చాలా కీలకంగా మారనుంది. అందుకే ఇక్కడ రెండు జట్లూ గెలవాల్సిన అవసరం ఉంది.