WTC 2023 Final: వార్నర్ మామను మడతపెట్టే భారత బౌలర్ అతడే.. డేంజరస్ బౌలింగ్‌తో రికార్డులు.. ఎవరంటే?

India vs Australia: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ జూన్ 7 నుంచి లండన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే, వార్నర్‌కు, ఈ సంవత్సరం టెస్ట్ ఫార్మాట్‌కు చాలా బ్యాడ్‌గా మారింది.

WTC 2023 Final: వార్నర్ మామను మడతపెట్టే భారత బౌలర్ అతడే.. డేంజరస్ బౌలింగ్‌తో రికార్డులు.. ఎవరంటే?
David Warner Siraj Wtc Fina

Updated on: Jun 04, 2023 | 12:16 PM

Warner vs Siraj WTC 2023: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ జూన్ 7 నుంచి లండన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి వచ్చాడు. ఇప్పటి వరకు సిరాజ్ కెరీర్ చాలా బాగుంది. అతను ఆస్ట్రేలియా ఆటగాడు వార్నర్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో మరోసారి ఇద్దరు ఆటగాళ్లు ముఖాముఖి తలపడే చాన్స్ ఉంది.

సిరాజ్ వర్సెస్ వార్నర్ ఇప్పటివరకు చాలా సందర్భాలలో ఒకరిపై ఒకరు మైదానంలోకి పోటీపడ్డారు. వార్నర్‌ను సిరాజ్ చాలా ఇబ్బంది పెట్టాడు. సిరాజ్ సంధించిన 70 బంతుల్లో వార్నర్ రెండుసార్లు ఔటయ్యాడు. దీంతో పాటు 55 బంతులను ఆడడంలో వార్నర్‌ తెగ ఇబ్బంది పడ్డాడు. వార్నర్ ఇప్పటి వరకు అతనిపై ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఇది టెస్టు రికార్డుగా నిలిచింది. సిరాజ్ ఐపీఎల్‌లోనూ ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో అతను సమర్థవంతంగా బౌలింగ్ చేశాడు.

వార్నర్‌కు, ఈ సంవత్సరం టెస్ట్ ఫార్మాట్‌కు చాలా బ్యాడ్‌గా మారింది. దక్షిణాఫ్రికాతో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. 11 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి ఔటయ్యాడు. దీని తర్వాత, భారత్‌తో జరిగిన నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో వార్నర్ అవుటయ్యాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఔట్ చేశాడు. ఢిల్లీ టెస్టులో షమీ వేసిన బంతికి పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..