IND vs AUS: వైజాగ్‌ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా.. ఏకంగా 10 వికెట్ల తేడాతో.. ఫ్యాన్స్‌ డిసప్పాయింట్‌

|

Mar 19, 2023 | 6:11 PM

భారీ వర్షం కురిసి ఉంటే బాగుండు.. మ్యాచ్‌ను రద్దు చేసి ఉంటే మంచిగా ఉండే.. విశాఖపట్నం వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓడిన తర్వాత ఫ్యాన్స్ మనసులో మెదిలిన మాటలివి.

IND vs AUS: వైజాగ్‌ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా.. ఏకంగా 10 వికెట్ల తేడాతో.. ఫ్యాన్స్‌ డిసప్పాయింట్‌
Ind Vs Aus 2nd Odi
Follow us on

భారీ వర్షం కురిసి ఉంటే బాగుండు.. మ్యాచ్‌ను రద్దు చేసి ఉంటే మంచిగా ఉండే.. విశాఖపట్నం వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓడిన తర్వాత ఫ్యాన్స్ మనసులో మెదిలిన మాటలివి. వైజాగ్‌ వన్డేలో భారత జట్టు చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆస్ట్రేలియాకు కనీసం పోటీ కూడా ఇవ్వలేక పూర్తిగా చేతులెత్తేసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అది కూడా 39 ఓవర్లు మిగిలి ఉండగానే. మొత్తానికి తమకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఉసూరుమనిపించడంతో క్రికెట్‌ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్‌ అయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది భారత జట్టు. అయితే ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్ స్టార్క్‌ (53/5) ధాటికి స్టార్‌ ప్లేయర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. శుభ్‌మన్‌ గిల్‌ (0), రోహిత్‌ (13), సూర్యకుమార్‌ యాదవ్‌ (0), రాహుల్‌ (9), హార్దిక్‌ పాండ్యా (1), రవీంద్ర జడేజా (16) పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే భారత్‌ కుప్పకూలింది. విరాట్‌ కోహ్లీ (31), అక్షర్‌ (29) కాస్తా రాణించడంతో ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. స్కార్క్‌కు తోడు ఆసీస్ పేసర్‌ సీన్‌ అబాట్‌ మూడు వికెట్లు, నాథన్‌ ఇల్లిస్ రెండు వికెట్లు తీసి టీమిండియాను కుప్ప కూల్చారు.

ఇక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లు అదరగొట్టిన పిచ్‌పై భారత్‌ బౌలర్లు పూర్తిగాతేలిపోయారు. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్ (66 నాటౌట్‌), ట్రావిస్ హెడ్ (51 నాటౌట్‌) సునామీ వేగంతో అర్ధ సెంచరీలు చేశారు. దీంతో ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే 121 పరుగులు చేసి ఆసీస్‌ గెలుపొందింది. టీమిండియాను కుప్పకూల్చిన స్టార్క్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. ఆస్ట్రేలియా విజయంతో మూడు వన్డేల సిరీస్‌ కాస్తా 1-1 తో సమమైంది. ఇక సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డే మ్యాచ్‌ బుధవారం (మార్చి 22న ) చెన్నై వేదికగా జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..