సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చెన్నై వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు సమష్ఠిగా రాణించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను బాగానే కట్టడి చేశారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ క్యారీ (38), ట్రావిస్ హెడ్ (33), లబూషేన్ (28), సీన్ అబాట్ (26), స్టొయినిస్ (25), వార్నర్ (23) పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా (44/3), కుల్దీప్ యాదవ్ (56/3) తలా మూడు వికెట్ల పడగొట్టగా.. అక్షర్ 2, సిరాజ్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే భారత్ బరిలోకి దిగగా.. ఆస్ట్రేలియా ఒక మార్పు చేసింది. ఆల్ రౌండర్ క్యామెరూన్ గ్రీన్ స్థానంలో డేవిడ్ వార్నర్‌ను తుది జట్టులోకి తీసుకుంది. గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగిస్తూ మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. 10.5 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఈ తరుణంలో హెడ్ (33)ను ఔట్ చేసి హర్దిక్ పాండ్యా భారత్‌కు మొదటి వికెట్ అందించాడు.
కాసేపటికే స్టీవ్ స్మిత్ (0), మిచెట్ మార్ష్ (47) వికెట్లు తీసి ఆసీస్‌ను మళ్లీ దెబ్బతీశాడు. డేవిడ్ వార్నర్ (23), లాబుషేన్ (28), స్టొయినిస్ (25), అలెక్స్ కార్వీ (38), సీన్ అబ్బాట్ (26) నిలకడగా ఆడినా భారీస్కోర్లు చేయలేకపోయారు. టాప్ ఆర్డర్‌ను హార్ధిక్ పాండ్యా దెబ్బతీయగా.. కుల్దీప్ యాదవ్ దెబ్బకు మిడిల్ ఆర్డర్ కకావికలమైంది. పాండ్యా, కుల్దీప్ తలో మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
For his vital three-wicket haul in the #INDvAUS ODI series decider, #TeamIndia vice-captain @hardikpandya7 becomes our ? performer from the first innings ???? @mastercardindia
A look at his bowling summary ? pic.twitter.com/32cqaPoGsZ
— BCCI (@BCCI) March 22, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి.